Benefit Shows In AP: ఔను సీఎం రేవంత్ రెడ్డి నిజం చెప్పారు. వాస్తవం మాట్లాడారు. తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గానే ఉంది. అదే ఏపీలో కూడా అమలు చేయడంటున్నారు ఏపీ సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ. సీఎం చంద్రబాబు కూడా తన నిర్ణయాన్ని వెల్లడించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సంధర్బంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అలాగే రేవంతి కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం, అల్లు అర్జున్ ను అరెస్ట్ కావడం, బెయిల్ పై బయటకు వచ్చిన విషయం కూడా తెలిసిందే.
తాజాగా ఈ కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ.. అందరూ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ చనిపోయిన మహిళ కుటుంబం గురించి, చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు శ్రీ తేజ్ గురించి సినిమా పెద్దలు పట్టించుకోక పోవడం తగదన్నారు. కేవలం అల్లు అర్జున్ తప్పిదం వల్లే తొక్కిసలాట జరిగిందని, ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే ఎలా అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.
తాజాగా ఏపీ సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం శ్రీ తేజ్ ఆరోగ్య స్థితిని తెలుసుకొనేందుకు వైద్యశాలకు వెళ్లారు. ఈ సంధర్భంగా బాలుడి కుటుంబసభ్యులతో కూడా ఆయన మాట్లాడారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. అబ్బాయికి వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవటం జరిగిందన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని, కొంత మెరుగ్గా ఉందని డాక్టర్లు తెలిపినట్లు రామకృష్ణ అన్నారు. ఇటువంటి సంఘటన జరగడం బాధాకరమని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వకూడదన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని ప్రకటించటాన్ని స్వాగతిస్తున్నామని రామకృష్ణ అన్నారు. ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయటాన్ని అభినందించారు.
Also Read: AP Govt: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ. 10 వేలు, రూ. 5 వేలు అందించేందుకు రెడీ!
కేవలం లాభార్జన కోసం మాత్రమే సినిమాలు తీసి ఎటువంటి సామాజిక బాధ్యత లేకుండా కొంతమంది నటులు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా సినిమా నటులు, దర్శక, నిర్మాతలు బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉందని తెలిపారు. హాస్పిటల్ వెళ్ళిన వారిలో సిపిఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు నెర్లకంటి శ్రీకాంత్ ఉన్నారు.