E-Paper
Advertisement

Kavitha: సోమవారం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన.. కవిత అభ్యంతరం, అదీ అసలు మేటర్

Kavitha: సోమవారం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన.. కవిత అభ్యంతరం, అదీ అసలు మేటర్
Advertisement

Kavitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఫుల్‌జోష్‌లో ఉందా? అదే ఊపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోందా? డిసెంబర్ ఒకటి అనగా సోమవారం నుంచి జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారా? ముఖ్యమంత్రి పర్యటనపై జాగృతి చీఫ్ కవిత ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? బీఆర్ఎస్ నేతలను ముందుగా అలర్ట్ చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

సోమవారం నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

Advertisement

తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడి డిసెంబర్ ఫస్ట్ వీక్‌కి రెండేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు సీఎం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు వివిధ జిల్లాల్లో పర్యటించ నున్నారు. తొమ్మిదిరోజులు అన్ని జిల్లాలను చుట్టేయనున్నారు. రెండేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన పనులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు.

జిల్లాల పర్యటన అనేది ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో కేవలం పట్టణ ప్రాంతాలకు ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్‌ ఒకటిన అంటే సోమవారంనాడు మహబూబ్‌‌నగర్‌ జిల్లా మక్తల్‌, మంగళవారం అంటే రెండున ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పర్యటించనున్నారు.

Advertisement

సీఎం టూర్లపై కవిత అభ్యంతరం

అలాగే మూడో తారీఖున కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో సీఎం పర్యటన ఉండనుంది. మొత్తం ఓవరాల్‌గా డిసెంబర్‌ 9 వరకు అంటే దాదాపు వారం రోజులపాటు జిల్లాలను చుట్టేయనున్నారు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనపై తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆదివారం ఉదయం ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వం సొమ్ముతో ప్రచారమా ? అంటూ ప్రశ్నించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే, జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ముమ్మాటికి ఎన్నికల నిబంధనను ఉల్లంఘించటమేనని రాసుకొచ్చారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ముఖ్యమంత్రి పర్యటనను నిలిపివేయాలని పేర్కొన్నారు.

ALSO READ: దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

కవిత ట్వీట్‌పై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మెల్లగా రియాక్ట్ అవుతున్నారు. పంచాయతీ ఎన్నికలు అనేవి గ్రామాలకు సంబంధించినవి అని, పార్టీలతో ఆ ఎన్నికలు ఎలాంటి సంబంధం ఉందని అంటున్నారు. అందులో పార్టీల గుర్తులు ఉండవని అంటున్నారు. ఈ లాజిక్.. కవిత ఎలా మిస్సయ్యారంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ట్వీట్లతో బీఆర్ఎస్‌ని మేల్కొపుతున్నారని అంటున్నారు.

 

Related News

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

Big Stories

Advertisement
×