E-Paper
Advertisement

Cyclone Michaung : దూసుకొస్తున్న తుపాను.. ఏపీలో భారీ వర్షాలు.. చెన్నై ఎయిర్ పోర్టు మూత..

Cyclone Michaung : దూసుకొస్తున్న తుపాను.. ఏపీలో భారీ వర్షాలు.. చెన్నై ఎయిర్ పోర్టు మూత..
Advertisement

Cyclone Michaung : ఏపీలో మిగ్‌జాం తుపాను ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిజాంపట్నం హార్బర్‌లో పదో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం తీరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. హార్బర్‌ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. చినగంజాం, పల్లిపాలెం తీరం వెంబడి అలల తాకిడి పెరిగింది. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భక్తులకు తాగునీరు అందించే జలాశయాలకు జలకళ వచ్చింది. పాపవినాశనం, కుమారధార, పసుపుధార, గోగర్భం, ఆకాశగంగ జలాశయాలు పూర్తిగా నిండాయి. తిరుమలలో 24 గంటల్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

అటు తమిళనాడులోనూ తుపాను తీవ్రత ఎక్కువగానే ఉంది. చెన్నై విమానాశ్రయంలో భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×