BigTV English

IND vs SA : సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ టైమింగ్స్ ఇవే !

IND vs SA : సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ టైమింగ్స్ ఇవే !
South Africa vs India

IND vs SA : సౌతాఫ్రికా టూర్ కి బయలుదేరుతున్న టీమ్ ఇండియా మ్యాచ్ ల షెడ్యూల్, టైమింగ్స్ వివరాలు బయటకు వచ్చాయి. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనుంది. ఇప్పటికే వేర్వేరు భారత జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. డిసెంబర్ 10న జరిగే తొలి టీ20తో టీమిండియా సౌతాఫ్రికా పర్యటన ప్రారంభమవుతుంది. రెండో టెస్ట్ ముగిసే వరకు అంటే జనవరి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సుమారు రెండు నెలలు భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా పర్యటనలోనే ఉండనున్నారు.


టీ 20 మ్యాచ్ లు రాత్రి 7.30కి ఒక మ్యాచ్ , రాత్రి 8.30 కి మరో రెండు మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.
వన్డేలకు వస్తే మధ్యాహ్నం 1.30 కి ఒక వన్డే, సాయంత్రం 4.30 కి రెండు వన్డేలు ప్రారంభం కానున్నాయి.
టెస్ట్ మ్యాచ్ లకి వస్తే మధ్యాహ్నం 1.30కి రెండే ప్రారంభం కానున్నాయి.

టీ 20 మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే…


డిసెంబర్ 10న తొలి టీ 20 డర్బన్,
డిసెంబర్ 12న రెండో టీ 20  జిక్యూబెర్హా,
డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్ లో మ్యాచ్ లు జరగనున్నాయి.

వన్డేల షెడ్యూల్ ఇదే…

డిసెంబర్ 17న తొలి వన్డే జోహెన్నెస్‌బర్గ్
డిసెంబర్ 19 న రెండో వన్డే జిక్యూబెర్హా
డిసెంబర్ 21న మూడో వన్డే పార్ల్ వేదికగా జరగనున్నాయి.

టెస్ట్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే…

డిసెంబర్ 26 నుంచి 30 వరకు, సెంచూరియన్ వేదికగా తొలిటెస్ట్ ప్రారంభం.
జనవరి 3 నుంచి 7 వరకు, కేప్‌టౌన్ వేదికగా.. రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.
ఈ రెండు టెస్ట్ లకే భారత్ సీనియర్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కొహ్లీ హాజరుకానున్నారు.

భారత టెస్ట్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్) ,శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్ (కీపర్),యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ.

భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా(వైస్‌ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), రింకూ సింగ్, జితేశ్ శర్మ(కీపర్), యశస్వీ జైస్వాల్,  రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ ముఖేష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, , దీపక్ చాహర్.

Related News

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

Big Stories

×