Dead Body In Parcel: అది పశ్చిమగోదావరి జిల్లా ఎండగండి. ఈ ప్రాంతంలో ఇప్పుడందరి నోళ్లలో నానుతున్న మాటలేంటంటే.. డెడ్ బాడీ పార్సిల్ గా ఎలా వచ్చింది? అసలీ మృతదేహాన్ని పార్శిల్ చేసి మరీ.. ఇక్కడికి పంపిన వారెవరు? ఈ ఆటో డ్రైవర్ కి డెడ్ బాడీ ఎవరిచ్చారు? అతడెలా ఈ డెడ్ బాడీని తెచ్చాడు? ఇది నార్మల్ డెత్తా.. లేక ఏదైనా మర్డర్ ఇన్వాల్వ్ మెంట్ ఉందా? ఇటు సామాన్యులే కాదు అటు పోలీసులను తొలిచేస్తోందీ ఘటన.
దీంతో ఉలిక్కిపడ్డ జిల్లా పోలీసులు.. ఘటనపై ముమ్మర దర్యాప్తు మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా జిల్లా ఎస్సీ.. అద్నాన్ నయీం ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి మరీ పర్యవేక్షణ చేస్తున్నారు. పార్సిల్ అందుకున్న రంగరాజు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఇరవై నాలుగ్గంటలలోగా నిందితులను పట్టుకుంటామని అన్నారు. మృతదేహం ఉన్న బాక్స్ సీజ్ చేసి తీసుకెళ్లారు.
ఈ డెడ్ బాడీ ఘటనలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. నాగతులసీ ఇంటికే ఈ మృతదేహాన్ని ఎవరు పంపారు? ఎందుకు పంపారు? రూ.1.30 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లెటర్ ఎందుకు పెట్టారు? గతంలో ఇంటి నిర్మాణానికి క్షత్రియ సేవాసమితిని ఆశ్రయించారు నాగ తులసి. ఇంటికోసం టైల్స్ విరాళంగా ఇచ్చింది క్షత్రియ సేవా సమితి. మరోసారి ఆదుకోవాలంటూ క్షత్రియ సేవా సమితిని కోరారు నాగలక్ష్మి. ఎలక్ట్రానిక్ పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు సేవాసమితి ప్రతినిధులు. అయితే ఈ కేసు కేవలం జిల్లాకు మాత్రమే కాదనీ.. దేశంలోనే కొత్త కేసని.. అంటున్నారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం.
Also Read: వామ్మో.. ఈ దొంగ మహా ముదురు.. లాయర్‌కే చుక్కలు చూపించాడుగా!
మరోవైపు ఆ పార్సిల్‌ను రంగరాజు చిన్నల్లుడు సుధీర్ పంపించాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగరాజు పెద్ద కుమార్తె నిర్మిస్తున్న ఇంటికి ఎలక్ట్రికల్ సామాన్లు పేరుతో ఈ పార్శిల్ వచ్చింది. డెడ్ బాడీ పార్శిల్ వచ్చిన తర్వాత రంగారాజు చిన్న అల్లుడు సుధీర్ కనిపించకుండా పోయాడు. దీంతో అతనిపై అనుమానాలు పెరిగాయి.
ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న శ్రీధర్‌వర్మకు ఏకంగా మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు ఉన్నట్టు తెలిసింది. రెండో భార్య రేవతికి అక్క అయిన తులసితో శ్రీధర్‌వర్మకి ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. దీంతో మృతదేహాన్ని ఎందుకు పంపించాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
డెడ్‌బాడీ యండగండికి గుర్తుతెలియని మహిళ పార్సిల్ పంపించినట్లు గుర్తించారు పోలీసులు. ఆటోడ్రైవర్‌తో పెట్టెను యండగండి తీసుకెళ్లాలని కిరాయి మాట్లాడింది. ఆ తర్వాత ఎరుపు కారులో ముఖానికి మాస్క్ ధరించి పరారైనట్లు గుర్తించారు. ఈ మహిళకు.. శ్రీధర్‌వర్మకు సన్నిహిత సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు.
అయ్తితే తాజాగా పార్శిల్ డెడ్‌బాడీ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి పర్లయ్యగా గుర్తించారు పోలీసులు. పర్లయ్యని హత్య చేసిందే అనుమానితుడుగా భావిస్తున్న సుధీర్‌వర్మగానే గుర్తించారు పోలీసులు. సుధీర్‌వర్మనే చంపి.. ఆ బాడీని పార్సిల్ రూపంలో ఇంటికి పంపించినట్లు తేల్చారు. అయితే ప్రస్తుతం పరారిలో ఉన్న సుధీర్‌వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో అనుమానితుడికి సహకరించిన మహిళ జాడ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సుధీర్‌వర్మ మూడు పెళ్లిళ్లు చేసుకునట్లు తేలింది.