E-Paper
Advertisement

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
Advertisement

Weather Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాన్ ముప్పు పొంచి వుంది. ఈసారి దీని ప్రభావం ఉత్తరాంధ్రపై స్పష్టంగా పడుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది వాతావరణ శాఖ. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఏపీకి మరో తుఫాన్ ముప్పు

తెలంగాణ వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఏపీకి మరో తుపాను ముప్పు పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం నాటికి అల్పపీడనం కాస్త వాయుగుండంగా వారే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఉత్తరాంధ్రలో భారీ వర్ష సూచన

Advertisement

దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో బుధవారానికి తీవ్ర తుపానుగా మారనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా. తుపాను సంకేతాల నేపథ్యంలో గురు-శుక్రవారాల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడతాయని భావిస్తోంది. వర్షాలతోపాటు బలమైన ఈదురు గాలులు వీయవచ్చని పేర్కొంది.

ALSO READ: లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

Related News

లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

రాప్తాడు ఘటన బాధితురాలి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే?

ఏపీలో 45 ఏళ్లుగా ఒకే కుటుంబం గుప్పిట్లో గ్రామ రాజకీయం.. ఎక్కడో తెలుసా..?

తిరుపతి శ్రీసిటీలో మరో భారీ అంతర్జాతీయ ప్రాజెక్టు ఆర్డర్?

వరాహ నదిలో విషాదం.. స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతు!

ఏపీలో రాప్తాడు కేసు నిందితుడి పరిస్ధితి విషమం.. ఆసుపత్రికి తరలింపు!

ఏకాభిప్రాయానికి రండి.. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జల సంఘం లేఖ..!

Big Stories

Advertisement
×