Bommisetty Family: సర్పంచ్ అంటే బొమ్మిశెట్టి.. బొమ్మిశెట్టి అంటే సర్పంచ్..! ఎన్టీఆర్ జిల్లా నరసింహరావుపాలెంలో 45 ఏళ్లుగా ఇదే పొలిటికల్ ట్రెండ్. 1981లో 26 ఏళ్లకే సర్పంచ్‌గా గెలిచిన భాస్కరరావు.. అప్పటి నుంచి గ్రామ రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తున్నారు. మిలటరీ కల కాస్తా.. గ్రామ రాజకీయాల వైపు మళ్లింది. అక్కడి నుంచి మొదలైన జర్నీ.. ఇప్పటికీ కొనసాగుతోంది.
రిజర్వేషన్లు మారాయి.. పదవులు మారాయి కానీ కుటుంబ పట్టు మాత్రం మారలేదు. భాస్కరరావు సర్పంచ్ అయితే.. భార్య దుర్గాదేవి కూడా సర్పంచ్ అయ్యారు. రిజర్వేషన్ అడ్డొచ్చినప్పుడు సర్పంచ్ పదవి వేరొకరికి ఉపసర్పంచ్ పదవి బొమ్మిశెట్టి కుటుంబానికి వచ్చాయి. 2013లో భాస్కరరావు 2021లో దుర్గాదేవి మళ్లీ సర్పంచ్‌లయ్యారు.
1400 ఓట్లు ఉన్న గ్రామంలో 45 ఏళ్లుగా ఒకే కుటుంబం పొలిటికల్ పట్టు కొనసాగిస్తోంది. తాము చేసిన అభివృద్ధే తమ బలమంటున్నారు భాస్కరరావు. ఇప్పుడు జనరల్ కేటగిరీ రావడంతో మరోసారి సర్పంచ్ రేసులోకి వస్తున్నారు. 45 ఏళ్లు ఎన్నో ఎన్నికలు.. ఎన్నో రిజర్వేషన్లు.. కానీ నరసింహరావుపాలెంలో బొమ్మిశెట్టి పొలిటికల్ బ్రాండ్ మాత్రం అలాగే ఉంది. ఈసారి కూడా అదే కుటుంబానికి ఓటర్లు జై కొడతారా..? లేక కొత్త నాయకత్వానికి ఛాన్స్ ఇస్తారా..? సీన్ ఏంటో ఈ ఎన్నికల్లో తేలనుంది.
Also read: తెలంగాణ కాంగ్రెస్‌కు.. కొత్త ఇన్‌ఛార్జ్ నియమించిన ఏఐసీసీ!