E-Paper
Advertisement

వరాహ నదిలో విషాదం.. స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతు!

వరాహ నదిలో విషాదం.. స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతు!
Advertisement

Varaha River: అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద వరాహ నదిలో సరదాగా స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన కేతేటి రిషి (18), కోడి జగదీష్ (20), ముప్పిడి నాగవంశీ (22) తో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గ్రోయిన్ వద్దకు వెళ్లారు. నదిలో స్నానానికి దిగిన ఆరుగురూ కొట్టుకుపోతుండగా.. స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాగా.. వెంటనే స్పందించి ముగ్గురిని ప్రాణాలతో కాపాడారు. అయితే, మిగతా ముగ్గురు నీటి ఉధృతికి కొట్టుకుపోయి ఆచూకీ లేకుండా పోయారు.

గాలింపు చర్యలు ముమ్మరం

Advertisement

యువకులు నదిలో గల్లంతైన విషయం తెలియగానే స్థానికులు నదిలోకి దిగి ఎంత వెతికినా ఎలాంటి ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ రామకృష్ణ, ఎస్సై రమేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేశారు. మెరుగైన గాలింపు చర్యల కోసం పోలవరం నుంచి ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు.

గ్రామంలో విషాదఛాయలు

Advertisement

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఇలా ఒక్కసారిగా నదిలో గల్లంతు కావడంతో పెనుగొల్లులో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఇళ్ల నుంచి నదికి వెళ్లిన పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లారేమోనని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్తులంతా నది ఒడ్డునే ఉండి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read: మమ్మల్ని ఆపడం ఎవరి తరమూ కాదు.. భారత్ సమ్మిట్‌లో రేవంత్ ధీమా

Tags

Related News

ఏపీలో రాప్తాడు కేసు నిందితుడి పరిస్ధితి విషమం.. ఆసుపత్రికి తరలింపు!

ఏకాభిప్రాయానికి రండి.. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జల సంఘం లేఖ..!

జనసేన లేకపోతే కూటమికి ఆ ఓట్లు కూడా వచ్చేవి కావు: బొత్స సత్యనారాయణ

తెలంగాణకు థ్యాంక్స్ చెప్పిన ఏపీ.. ఇక్కడి అధికారులపై ప్రశంసలు.. ఎందుకంటే?

ఏపీలో మళ్లీ మోగిన ఎన్నికల నగారా.. నేడు పెండింగ్ పురపాలికలు.. రేపు తొలి దశ పంచాయతీలకు నామినేషన్లు!

ఇచ్చాపురంలో వైసీపీ ఘోర పరాజయం.. ఓటమికి అసలు కారణం అదేనా..?

విశాఖ సీఐఐ సదస్సులో ఏపీకి రూ.5.84 లక్షల కోట్ల పెట్టుబడులు!

Big Stories

Advertisement
×