Pawan Kalyan: చెప్పాడంటే.. చేస్తాడంతే.. ఈ డైలాగ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కరెక్ట్ గా సూటవుతుందంటున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. రానున్న రోజుల్లో పిఠాపురంకు పవన్ తన మకాం మార్చడం ఖాయం అంటున్నారు వారు. వాస్తవంగానే పవన్ తన మకాం పిఠాపురం మార్చారో, అభివృద్దిలో తమ నియోజకవర్గం తగ్గేదెలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా పిఠాపురం వాసుల ఆశలు చిగురించేందుకు అసలు కారణం తెలుసుకుందాం.
పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ప్రజలు ఘన విజయాన్ని అందించారు. పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో ఏకంగా సుమారు 70 వేలకు పైగా మెజారిటీని పవన్ సాధించారంటే, ఆయనపై వారికి ఉన్న నమ్మకానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అందుకే కాబోలు తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన పిఠాపురం అభివృద్దిపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీ డిప్యూటీ సీఎం గా కూడా భాద్యతలు చేపట్టిన పవన్.. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం తమ అదృష్టం అంటుంటారు పిఠాపురం వాసులు.
అయితే ఎన్నికల సమయంలో తాను పిఠాపురంలోనే నివాసం ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చారు కానీ ఇంకా ఆ దిశగా పవన్ అడుగులు వేయలేదని అక్కడ జోరుగా చర్చలు కూడా సాగేవి. ఉన్నట్టుండి పవన్ పిఠాపురం నియోజకవర్గంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44, 2.08 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. తాను విజయాన్ని అందుకున్న అనంతరం ఈ స్థలం గురించి బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. తాను కొనుగోలు చేసిన స్థలాన్ని యువత మంచి పనుల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
ఇక పవన్ కేరాఫ్ అడ్రస్ పిఠాపురం అనే రోజులు లేవు అనుకున్నారు అందరూ. కానీ పవన్ చెప్పాను.. చేస్తానంటూ తాజాగా ఒకేసారి 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో తన నివాస గృహంతో పాటు, పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలన్నది పవన్ ఆకాంక్షగా అభిమానులు చెబుతున్నారు. ఇప్పటికే మేము పిఠాపురం ఎమ్మేల్యే గారి తాలూకా అంటూ క్యాప్షన్ క్రియేట్ చేసిన పిఠాపురం వాసులు, పవన్ తన మకాం అక్కడికే మారిస్తే, మా నియోజకవర్గానికి తిరుగు లేదు.. ఎదురులేదంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇటీవల ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు నియోజకవర్గంలో పవన్ శంఖుస్థాపన చేశారు. అంతేకాదు ప్రతి పాఠశాల, వైద్యశాల ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్య తన దృష్టికి వచ్చినా స్వంత నిధులను కూడా వెచ్చిస్తున్నారట పవన్. అందుకేనేమో రావయ్యా.. రావయ్యా.. పవన్ అంటూ వారందరూ స్వాగతం పలుకుతున్నారు. వీరి కోరిక తీరే సమయం ఎప్పుడో మరి!
పిఠాపురంలో 12 ఎకరాలు కొన్న పవన్‌కళ్యాణ్
ఆయన తరపున రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసిన రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేశారు.
కొత్త స్థలంలో పవన్‌కళ్యాణ్ ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్టు సమాచారం
తాను పిఠాపురంలో ఇల్లు… pic.twitter.com/30BnWCvz3n
— BIG TV Breaking News (@bigtvtelugu) November 6, 2024