Trump Praises Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం దాదాపు ఖరారు కావడంతో.. ఆయన మద్ధతుదారులు సంబురాల్లో మునిగిపోయారు. ప్రస్తుత ఎన్నికలో గెలుపుతో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్.. తన విజయానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో.. ప్రముఖ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిచిన ట్రంప్.. ముందస్తు విజయోత్సవ వేడుకలు నిర్వహించిన సందడి చేశారు.
తన సభలు, సమావేశాల్లో నిత్యం అభిమానాలు, మద్ధతుదారులను ఉత్సాహపరిచే ట్రంప్.. ప్రస్తుత ఎన్నికల్లో సానుకూల ఫలితాలతో మరింత జోష్ లో ఉన్నారు. ఫ్లోరిడాలో ముందస్తు గెలుపు సంబరాలు నిర్వహించిన ట్రంప్.. అనేక విషయాలపై ప్రసంగించారు. ఇందులో.. ఎన్నికల ప్రచార సమయంలో మస్క్ తో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న ట్రంప్.. అతనో అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రసంసించారు.
నిత్యం అనేక ముఖ్యమైన పనుల్లో హడావిడిగా ఉండే ఎలాన్ మస్క్.. తన కోసం రోజుల తరబడి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారని, తన గెలుపు కోసం ప్రయత్నించారని ప్రశంసించారు. ఇది కేవలం.. మస్క్ వల్లే సాధ్యమవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అందుకే.. నువ్వంటే నాకిష్టం ఎలాన్ అంటూ.. అభిమానాన్ని చాటుకున్నారు.
ట్రంప్‌ను కొత్త అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు తాను అన్ని విధాలా ప్రయత్నిస్తున్నానని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, కొత్త ఐడియాలతో ప్రపంచాన్ని నూతన సాంకేతికతల వైపు నడిపించే వ్యక్తిగా మంచి పేరున్న మస్క్.. సపోర్ట్ ట్రంప్ నకు బాగా ఉపయోగపడిందంటున్నారు.. విశ్లేషకులు. మస్క్ మద్ధతు కారణంగా.. డోనాల్ట్ ట్రంప్ మద్ధతుదారుల్లో మరింత ఉత్సాహం వచ్చింది. ఒకరకంగా ఓటర్లు, వశ్లేషకుల దృష్టిని ఆకర్షించేందుకు మస్క్ మద్ధతు సరైన సమయంలో ఉపయోగపడింది అంటున్నారు. ఇదంతా.. వారిరువు వ్యాపారవేత్తలు కావడంతో, వారి ఆలోచనా సరళలు కలిసి ఉంటాయన్నది చాలా మంది ఆలోచన
ఇప్పటి వరకు అధికారికంగా ట్రంప్ గెలుపు ప్రకటించకపోయినా, వివిధ ఛానెళ్లల్లో వస్తున్న ఎన్నికల ఫలితాలను చూస్తూ.. తానే విజయం సాధించబోతున్నానంటూ ప్రకటించారు. మద్ధతుదారుల మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యలో ప్రసంగించిన యూఎస్ మాజీ అధ్యక్షుడు.. ఈ రోజు సాధించే రాజకీయ విజయం.. మన దేశం గతంలో ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు.ప్రస్తుతానికి పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో. ట్రంప్ నకు అనుకూలంగా ఫలితాలు వెడువడగా, ఇంకా.. అనేక రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.
Also Read : ఎలన్ మస్క్‌పై ఫ్రాడ్ కేసు.. రోజూ మిలయన్ డాలర్లు ఇస్తానని మోసం!
ట్రంప్ విజయం కోసం తీవ్రంగా ప్రచారం చేసిన ఎలాన్ మస్క్… ట్రంప్ కార్యవర్గంలో ప్రభుత్వ ఎఫిషెన్సీ కమిషన్ కు బాధ్యతలు చేపట్టవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీటికి బలం చేకూర్చుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మస్క్.. గతంలో ట్రంప్ నతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. గేమ్,సెట్ అండ్ మ్యాచ్ అంటూ రాశారు.