E-Paper
Advertisement

Devieni Chandrasekhar Rao Death: దేవినేని ఉమా ఇంట విషాదం.. సోదరుడు చంద్రశేఖరరావు మృతి!

Devieni Chandrasekhar Rao Death: దేవినేని ఉమా ఇంట విషాదం.. సోదరుడు చంద్రశేఖరరావు మృతి!
Advertisement

Devieni Uma’s Brother Chandrasekhar Rao Died: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖరరావు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పాటు.. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు.

తన సోదరుడు ఆస్పత్రిలో ఉండటంతో.. దేవినేని ఉమా మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉండి.. ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వచ్చారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో.. కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వస్థలమైన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు తరలించారు. ఈరోజు సాయంత్రమే అంత్యక్రియలు జరగనున్నాయి. దేవినేని చంద్రశేఖరరావు మరణవార్త విన్న టిడిపి నేతలు.. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపి.. దేవినేని ఉమా ను ఫోన్ లో పరామర్శించారు. సోదరుడి మృతితో దేవినేని ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×