E-Paper
Advertisement

Dithwa Cyclone: భారత్ వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

Dithwa Cyclone: భారత్ వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
Advertisement

Dithwa Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన శక్తిమంతమైన ‘దిత్వా’ తుఫాన్‌ తీవ్రత పెంచుకుంటూ వేగంగా భారత తీరాల వైపు దూసుకొస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో తీవ్ర ప్రభావం చూపిన ఈ తుఫాన్‌, అక్కడ భారీ వర్షాలు, ఈదురు గాలులతో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ప్రస్తుతం ఈ తుఫాన్‌ ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంకలోని తూర్పు తీర ప్రాంతాలకు సమీపంలో కొనసాగుతోంది. ట్రింకోమాలికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో, కలోవాకు దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో తుఫాన్‌ కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదే సమయంలో మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కూడా తుఫాన్‌కు బలాన్ని చేకూరుస్తోంది. ప్రస్తుతం ఇది కరైకల్‌కు 270 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 380 కిలోమీటర్లు, చెన్నైకి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం సాయంత్రం కానీ, ఆదివారం వేకువజామున ఇది ఉత్తర వాయు దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్న ఐదు రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలు, అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి, అనంతపురం, కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా ఉంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.

తుఫాన్ గాలుల వేగం గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉన్నందున, తీరప్రాంతాల్లో తీవ్ర గాలులు వీచే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో సముద్రం అలజడిగా మారనుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Also Read: పాతబస్తీలో పేలుడు.. బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ వీడియో

భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసి, అవసరమైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×