E-Paper
Advertisement

Srisailam : వైద్యుల నిర్లక్ష్యం.. శ్రీశైలంలో భక్తుడు మృతి..

Srisailam : వైద్యుల నిర్లక్ష్యం.. శ్రీశైలంలో భక్తుడు మృతి..
Advertisement

Srisailam : దైవదర్శనానికి వచ్చిన ఓ భక్తుడు అస్వస్థతకు గురై వైద్యం అందక మృతి చెందాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా శ్రీశైలంలోని ప్రాథమిక వైద్యశాలలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన సిద్దంశెట్టి సురేష్ ప్రసాద్ (35) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి శ్రీశైల స్వామి దర్శనం కోసం వెళ్లారు. స్వామిఅమ్మవార్ల దర్శనం అనంతరం సాక్షి గణపతి ఆలయ దర్శనానికి వెళ్లాడు.

ఆలయం వద్ద అనారోగ్యంతో ప్రసాద్ పడిపోయాడు. వైద్యం కోసం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. ఈ సమయంలో 108 సిబ్బంది , వైద్యశాల సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. గొడవ కారణంగా సకాలంలో వైద్యులు స్పందించకపోవడంతో సురేష్ ప్రసాద్ మృతి చెందాడు. మృతిని భార్య ఆర్తనాదాలు అక్కడి భక్తులను కలిచివేసింది. వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×