Illu Illalu Pillalu Today Episode September 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. కామాక్షి కోసం రామరాజు లక్ష రూపాయలు ఇవ్వడానికి బ్యాంకు కి ఫోన్ చేస్తాడు. బ్యాంకు మేనేజరు రామరాజుకి ఫోన్ పే యాప్ గురించి చెప్పిన సరే అవన్నీ నాకు తెలియదండి మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని అంటాడు. ఇక మేనేజర్ చేసేదేమీ లేక రామరాజు అకౌంట్ నుంచి లక్ష రూపాయలు కామాక్షి వల్ల భర్త అకౌంట్లో వేస్తారు. అయితే ధీరజ్ మాత్రం తన తండ్రి అకౌంట్లో ఎవరికి తెలియకుండా లక్ష రూపాయలు వెంటనే డిపాజిట్ చేయాలని అనుకుంటాడు. బ్యాంకు టైం అయిపోయిందని అకౌంటెంట్ చెప్పడంతో ధీరజ్ ఫీలవుతాడు. బ్యాంక్ మేనేజర్ బ్యాలెన్స్ చెప్పడంతో రామరాజు షాక్ అవుతాడు. ఆ డబ్బులు ధీరజ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినట్లు తెలియడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చందు ఇచ్చిన లక్ష రూపాయలు డబ్బుని నాన్నకు తెలియకుండా ఎలాగైనా సరే అకౌంట్ లో వేయాలి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ డబ్బులు నీ అకౌంట్లో వేసి గూగుల్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు. కానీ బ్యాంకుకు వెళితే అక్కడ టైం అయిపోయింది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే మీకంతా అర్జెంట్ అయితే వెళ్లి డబ్బులు మిషన్లో డిపాజిట్ చేసుకోండి అని అతను సలహా ఇస్తాడు. ధీరజ్ మాత్రం రేపైనా కచ్చితంగా నాన్న అకౌంట్లో డబ్బులు వేయాలి అని అనుకోని బయటకు వస్తాడు..
బ్యాంక్ బయట ఉన్న ప్రేమ ఆ డబ్బులు ఎక్కడిది అని అడుగుతుంది. ఏ డబ్బులు గురించి మాట్లాడుతున్నావు అని ధీరజ్ కావాలని అడుగుతాడు. బండిలో ఉన్న డబ్బులను తీసి ప్రేమ ఈ లక్ష రూపాయలు డబ్బులు నీకు ఎక్కడివి రా అని నిలదీస్తుంది. మీ అన్నయ్య టీ షాప్ దగ్గర నీకు డబ్బులు ఇవ్వడం నేను చూసాను అందుకే అడుగుతున్న ఎక్కడివి అని ప్రేమ అంటుంది. కానీ ధీరజ్ మాత్రం ఏమీ చెప్పకుండా ఉంటాడు.
రాత్రి అవ్వగానే రామరాజు తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీవల్లి మాత్రం చాలా సంతోషంగా ఈరోజు ఇంట్లోంచి వెళ్లిపోతాడు అని చాలా సంతోషంగా ఉంటుంది. రామరాజు ధీరజ్ పై సీరియస్ గా ఉంటాడు. ధీరజ్ ప్రేమ ఏమైందని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ధీరజ్ ఏమైంది నాన్న అర్జెంటుగా రమ్మని పిలిచారు అని అడుగుతాడు ధీరజ్.. రామరాజు నా అకౌంట్లో నుంచి డబ్బులు నువ్వు ఎందుకు తీసుకున్నావు రా అని అడుగుతాడు.
అడుగుతుంటే సమాధానం చెప్పవ్ ఏంట్రా నా ఫోన్ నుంచి లక్ష రూపాయలు దొంగ చాటుగా నీ ఫోన్ కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నావు రా అని రామరాజు అడుగుతాడు. లేని ప్రేమలో నటించి డబ్బులు కొట్టేస్తావా అని రామరాజు నిలదీస్తాడు. ధీరజ్ మాత్రం ఏమీ సమాధానం చెప్పలేక గిలగిలా కొట్టుకుంటాడు. ఇక శ్రీవల్లి ఎందుకంటే ధీరజ్ ఎలా చెప్తాడు మామయ్య గారు అండి ప్రేమ కోసమే ఈ డబ్బులను కొట్టేసి ఉంటాడు అని శ్రీవల్లి అంటుంది.
ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ శ్రీవల్లి అని రామరాజు అంటాడు. ప్రేమ వాళ్ల ఇంట్లో మహారాణి కదండి.. ఆమెని అపురూపంగా ఖరీదైన బట్టలు ఖరీదైన నగలు కొనివ్వాలంటే కచ్చితంగా ధీరజ్ జీతం సరిపోదు కదా మావయ్య గారు అందుకే కొట్టేసి ఉంటాడు అని శ్రీవల్లి అంటుంది.. ఒకవైపు వేదవతి ఎంత అంటున్న సరే శ్రీవల్లి మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటుంది. నర్మదా అక్క ధీరజ్ని మావయ్య గారు అడుగుతున్నారు కదా ఎందుకు నువ్వు మధ్యలో కలగజేసుకొని మాట్లాడతావు.. అని సీరియస్ అవుతుంది.
Also Read: మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవే స్పెషల్..
నువ్వు ఇంటికి పెద్ద కోడల్ని అడిగే హక్కు నాకుంది. తప్పు జరిగితే అడిగే హక్కు నాకుంటుంది. ఆ మాట వినగానే నర్మదా ధీరజ్ సమాధానం చెప్పేంతవరకు ఆగవా అని అంటుంది దానికి రామరాజు మీరు ఆగండి అడుగుతాను అని రామరాజు అంటాడు. ధీరజ్ నీ కొట్టబోతుంటే ప్రేమ అడ్డుపడుతుంది.. అక్కడి తో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ధీరజ్ డబ్బులను చందు కోసం కొట్టేసినట్లు చెప్తాడా? శ్రీవల్లి బండారం బయట పడుతుందా అన్నది చూడాలి.. ఏది ఏమైనా కూడా రేపటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అర్థమవుతుంది.