OTT Movie : అందాల తార కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించిన సినిమా ‘Saani Kaayidham’. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి. 1989లో జరిగే ఈ కథ పోన్ని అనే పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. కుల సమస్య ప్రధాన థీమ్ తో ఈ సినిమా నడుస్తుంది. పోన్నికి జరిగిన అన్యాయానికి, ఆమె రివేంజ్ తీర్చుకునే సీన్స్ భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘Saani Kaayidham’ 2022 మే 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన తమిళ యాక్షన్ చిత్రం. దీనికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తి సురేష్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సుందర్ అరుముగం నిర్మాతగా వ్యవహరించారు. 136 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా IMDbలో 7.4/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎమ్‌ఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉంది.
1989లో పరదేశపట్టినం అనే గ్రామంలో, పోన్ని ఒక పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తుంటుంది. తన కూతురు మంచి చదువు చదవాలని కలలు కంటుంది. ఆమె భర్త మారి ఒక మిల్ వర్కర్. కుల సమస్యలు, పేదరికం నుండి బయటపడడానికి అతను స్థానిక ఎన్నికల్లో పాల్గొంటాడు. ఇది మిల్ యజమాని బంధువుతో గొడవకు దారితీస్తుంది. ఈ క్రమంలో మారి ఉద్యోగం కోల్పోతాడు. ఈ గొడవ కారణంగా, ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తులు పోన్నిపై అఘాయిత్యం చేస్తారు. ఆ తరువాత ఆమె భర్త, కూతురిని సజీవ సమాధి చేస్తారు. ఒక్కసారిగా పోన్ని జీవితం తలకిందులవుతుంది. ఆమె న్యాయం కోసం కోర్టుకు వెళ్తుంది. కానీ వ్యవస్థ ఆధిపత్య కులం వైపు మొగ్గు చూపడంతో మరింత బాధపడుతుంది.
ఈ సమయంలో ఆమె సవతి సోదరుడు సంగయ్య, ఆమెకు సహాయం చేయడానికి ముందుకొస్తాడు. గతంలో వీళ్ళకి విభేదాలు ఉన్నప్పటికీ, వీళ్ళు కలిసి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక ప్లాన్ వేస్తారు. పోన్ని ఒక లిస్ట్ తయ్యారు చేస్తుంది. ఇందులో ఆమెను బాధపెట్టిన వారి పేర్లు ఉంటాయి. పోన్ని, సంగయ్య ఒక్కొక్కరిని వెతికి, కిరాతకంగా చంపడం ప్రారంభిస్తారు. ఫ్లాష్‌బ్యాక్‌లలో పోన్ని, సంగయ్య గతంలో ఒకరితో ఒకరు ఎందుకు విడిపోయారో తెలుస్తుంది. సంగయ్య తన జీవితంలో జరిగిన ఒక ట్రాజిడీతో కోపంగా ఉంటాడు. దీంతో పోన్నికి మద్దతుగా నిలుస్తాడు. చివరికి పోన్ని తన రివేంజ్ ని తీర్చుకుంటుందా ? పోన్ని, సంగయ్యల గతం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : మొగుడి వల్ల కావట్లేదని… హోటల్ గదిలో మరొక వ్యక్తితో… ఫ్యామిలీతో కలిసి చూడకూడని మూవీ భయ్యా