E-Paper
Advertisement

కొండెక్కిన కోడిగుడ్డు ధర.. సామాన్యుడి జేబుకు చిల్లు, రానున్న రోజుల్లో ఈ ధర మరింత

కొండెక్కిన కోడిగుడ్డు ధర.. సామాన్యుడి జేబుకు చిల్లు, రానున్న రోజుల్లో ఈ ధర మరింత
Advertisement

Egg Price Hit: ఎల్ నినో ప్రభావం అన్నింటిపై క్రమంగా చూపుతోంది. ఫలితంగా అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కోడి గుడ్డు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కోళ్ల ఫారాల వద్ద చిల్లరగా ఒకొక్కటి రూ.6.95కు చేరింది. ఈ లెక్కన మార్కెట్లోకి వచ్చేసరికి రూ.8.50 నుంచి 9 పలుకుతోంది. ఈ స్థాయిలో ధరలు పెరగడానికి కారణమేంటి?

కొండెక్కిన కోడిగుడ్డు ధర-ఏ వస్తువైనా ఉత్పత్తి చేసిన దగ్గర ధర తక్కువగా ఉంటుంది. మార్కెట్లోకి వచ్చేసరికి ట్రాన్స్‌పోర్టు, టాక్స్‌లతో కలిసి తడిసి మోపుడు అవుతోంది. తాజాగా కోడిగుడ్ల ధరదీ అదే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడిగుడ్డు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కోళ్ల ఫారాల వద్ద ప్రస్తుతం గుడ్డు ధర రూ.6.95 చేరింది. మరి మార్కెట్లోకి వచ్చేసరికి ఎంతకు లభిస్తుందో ఒక్కసారి ఆలోచించండి.

Advertisement

సామాన్యుడి జేబుకు చిల్లు-గతేడాది డిసెంబరు 23న నమోదైన గరిష్ఠ ధరతో ప్రస్తుతం సమానమైంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.8.50కు పైగా విక్రయిస్తున్నారు. ఫలితంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. గతేడాది ఇదే నెలలో ఫారం వద్ద గుడ్డు ధర కేవలం రూ.4.90 మాత్రమే. ప్రస్తుతం భారీగా పెరిగింది. ధరల పెరుగుదలకు ఎండల తీవ్రత, కోళ్ల మరణాలు, ఉత్పత్తి తగ్గుదల కారణమని అంటున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు.

కోళ్ల ఫారాల వద్ద ఒకొక్కటి రూ.6.95- ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 కోట్లకు పైగా కోళ్లు ఫారాలు ఉంటాయన్నది ఓ అంచనా. రోజుకు కోటి గుడ్లు అక్కడ ఉత్పత్తి అవుతాయి. వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 16.35 లక్షల కోళ్లు మృతి చెందాయి. అనధికార లెక్క మాత్రం 20 లక్షల పైమాటేనని అంచనా వేస్తున్నారు. మిగిలిన కోళ్లకు వేడి ప్రభావంతో గుడ్లు పెట్టలేని పరిస్థితి నెలకొంది.

Advertisement

వాతావరణం.. ఆపై ధరలు-ఫలితంగా ఉత్పత్తి అమాంతంగా తగ్గిపోయింది. మార్కెట్లో గుడ్లకు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ పరిశ్రమ విషయంలో రైతులకు ప్రభుత్వ సహాయం అవసరమని అంటున్నారు. గుడ్డు ధరలు పెరగడం వల్ల రైతులకు లాభం దక్కదని కోళ్ల రైతుల సంఘం చెబుతోంది. కోళ్ల దాణా ధరలు విపరీతంగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందన్నారు.

సోయా ధర టన్నుకు రూ.40 వేల నుంచి రూ.65 వేలు పలుకుతోందని చెబుతోంది. నూనె తీసిన తౌడు ధర రూ.12 వేల నుంచి రూ.22 వేలకు చేరింది. మొక్కజొన్న ధర రూ.19 వేల నుంచి రూ.24,500కు పెరిగినట్లు చెబుతున్నారు. దాణా ఖర్చులు పెరగడం, ఎండల కారణంగా కోళ్ల మరణాలు, ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల రైతులు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు.

ALSO READ: ముద్రగడ అంత్యక్రియలు.. అంబటి రాంబాబు దురుసు ప్రవర్తన, కేసు నమోదు చేసిన పోలీసులు

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటేనే పరిశ్రమ మళ్లీ గాడిన పడుతుందని చెబుతున్నారు.

Related News

పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల కష్టాలు పట్టవా? సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్!

గుంటూరు ల్యాండ్ వివాదం.. చంద్రబాబుకు జోగి రమేష్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే ఎంక్వైరీ వేసుకోండి!

రాయలసీమ అభివృద్ధిపై.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్!

విజయసాయిరెడ్డి ఎక్కువగా ఊహించుకోవద్దు.. పబ్లిసిటీ కోసమే-సజ్జల కౌంటర్ ఎటాక్

షాకైన వైసీపీ పెద్దలు.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు, అసలు ఏం జరిగింది?

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?

జై కొడుతూనే జేబులు కొట్టేశారు.. మంత్రుల పర్యటనలో జేబు దొంగల హల్‌చల్

తాకట్టు ఉంగరం గొడవ ప్రాణాలు తీసిందా? వేల్పూరు దంపతుల ఆత్మహత్య వెనుక అసలు కథ!

Big Stories

Advertisement
×