E-Paper
Advertisement

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన
Advertisement

Jogi Meghana:కొన్ని రోజుల కిందట మీడియాలో తెగ వైరల్ అయిన జోగి రమేష్ కుటుంబ వ్యవహారం మరోసారి తెరమీదకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసు కేసులు పెట్టుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో వార్తల్లో నిలిచిన సంగతి తెల్సిందే.

తాజాగా జోగి కుటుంబ కోడలు జోగి మేఘన తాజాగా ఏపీ గవర్నర్‌ను కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆమె.. తన భర్త జోగి రాజీవ్‌తో పాటు అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులపై తాను చేసిన ఫిర్యాదుల విషయంలో ఇప్పటివరకు జరిగిన విషయాలని గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తుంది.

Advertisement

అదనపు కట్నం పేరుతో ఇబ్బందులు

తనకు ఎదురైన వేధింపులు, గృహహింస, అదనపు కట్నం పేరుతో ఇబ్బందులు పెట్టారన్న ఆరోపణలతో ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన మేఘన కేసుల దర్యాప్తు, వాటిపై చర్యల గురించి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలుస్తోంది. తన ఫిర్యాదుపై చట్ట ప్రకారం త్వరగా చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచించాలని ఆమె కోరినట్లు సమాచారం.

Advertisement

ఇక మేఘన గవర్నర్‌కు కుటుంబ వివాదానికి సంబంధించిన పలు అంశాలను చెప్పినట్టు తెలుస్తుంది. పెళ్లి అయిన తర్వాత ఎదురైన పరిస్థితులు, తనపై జరిగిన మానసిక, శారీరక వేధింపులు, కట్నం విషయంలో వచ్చిన ఆరోపణలు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వంటి విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే ఈ కేసులో తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కూడా ఆమె కోరినట్లు తెలుస్తోంది.

వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌

తనకు జరిగిన అన్యాయంపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని, అవసరమైన సమయంలో వాటిని బయటపెడతానని ఆమె అప్పట్లో మీడియా ముందు చెప్పింది కూడా. తాజాగా గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడంతో ఈ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా ఇప్పటికే పోలీసు స్థాయిలో కేసు నమోదై ఉన్న ఈ క్రమంలో కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది? తనకు ఎలా రక్షణ కలిపిస్తారు వంటి అనే అంశాలను మేఘన రాజ్‌భవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో 

తన ఫిర్యాదుపై అధికారులు వేగంగా స్పందించి, చర్యలని తీసుకోవాలని ముందుకు తీసుకెళ్లాలని ఆమె కోరినట్లు సమాచారం. కుటుంబ సమస్యగా మొదలైన వివాదం ఇప్పుడు పోలీసు కేసులు, మీడియా సమావేశాలు, రాజకీయ విమర్శల వరకు వెళ్లడంతో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఇక జోగి మేఘన గవర్నర్‌ను కలవగా .. ఆమె వినతిపై రాజ్‌భవన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో మేఘన ఫిర్యాదులపై  అధికారుల స్పందన ఎలా ఉంటుంది? కేసు దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

వివాదం రోజుకో మలుపు

మొత్తంగా చూస్తే.. జోగి రమేష్ కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసు కేసులతో మొదలైన వ్యవహారం మీడియా ముందుకు రావడం, పరస్పర ఆరోపణలు, తాజాగా గవర్నర్‌ను వద్దకి వెళ్ళడం చూస్తే ముందు ముందు ఈ వ్యవహారం మరింత ముదిరేలానే కనిపిస్తుంది.

ALSO READ:చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

Tags

Related News

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

ఏపీలో కొత్త పింఛన్లపై.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులతో పిడుగులు!

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!

Big Stories

Advertisement
×