E-Paper
Advertisement

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?
Advertisement

Nara Lokesh Chandrababu Arrest:జగన్ హయాంలో చంద్రబాబు అరెస్ట్ ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరికీ తెల్సిందే.ఇక ఆ ఘటనకి సరిగ్గా మూడేళ్ళు నిండటంతో తెలుగు దేశం పార్టీ కొవ్వొత్తులు వెలిగిస్తూ ఆనాటి చీకటి రోజులని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు అయి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన కొడుకు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆనాటి సంఘటనని గుర్తుచేసుకుంటూ ప్రత్యేకంగా నిరసన తెలియజేశారు.

ఉండవల్లిలోని తన నివాసంలో లోకేశ్ 53 కొవ్వొత్తులను వెలిగించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కారణంగా 53 రోజుల పాటు జైలులో నిర్బంధాన్ని అనుభవించారని, దానికి గుర్తుగానే ఈ 53 కొవ్వొత్తులను వెలిగించినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ‘నిజం గెలిచింది’ అనే సందేశాన్ని ఇస్తూ ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.

Advertisement

మూడేళ్ల క్రితం అప్పటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిన చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెల్సిందే. అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగిన ఈ అరెస్ట్ వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

అప్పట్లో ఈ అరెస్టును నిరసిస్తూ టీడీపీ నాయకులు, శ్రేణులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు కూడా.చంద్రబాబుపై రాజకీయ కక్షసాధింపుతోనే తప్పుడు కేసులు పెట్టి కావాలనే జైలుకు పంపారని టీడీపీ మొదటి నుంచీ ఆరోపించిన సంగతి తెల్సిందే.

Advertisement

తాజాగా ఆనాటి రోజును గుర్తుచేసుకున్న లోకేశ్, ఎంతటి కుట్రలు పన్నినా, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆఖరికి సత్యమే గెలుస్తుందని తెలిపారు. చంద్రబాబు జైలులో ఉన్న ఆ 53 రోజులు పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు ఎంతో కష్టమైన సమయమని అయినా అందరూ ధైర్యంగా పోరాడారని చెప్పారు. నాటి సర్కార్ ఎంత వేదించినా తట్టుకుని నిలబడటమే కాకుండా, ప్రజల్లో వాళ్ళు చేసిన తప్పులని ఎప్పటికప్పుడు ఎండగట్టామని గుర్తుచేశారు.

ఆ అరెస్ట్ ని సహించలేకే ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించారని ప్రజల ఆశీస్సులతోనే తమ కూటమి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. నాడు చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూసినవారికి ప్రజలే తమ తీర్పు ద్వారా తగిన సమాధానం చెప్పారని, చివరికి ‘నిజమే గెలిచింది’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ALSO READ:చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

మొత్తానికి మూడేళ్లయిన సందర్భంగా లోకేశ్ నిర్వహించిన ఈ కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం టీడీపీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.

Tags

Related News

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

ఏపీలో కొత్త పింఛన్లపై.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులతో పిడుగులు!

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!

Big Stories

Advertisement
×