BigTV English

YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: సీఎం జగన్ డిమాండ్

YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: సీఎం జగన్ డిమాండ్

YS Jagan latest comments(Andhra pradesh political news): వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడకుండా కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యారని ఫైర్ అయ్యారు. పల్నాడులో నడిరోడ్డుపై రషీద్ అనే యువకుడిని కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామని జగన్ తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో ధర్నా చేస్తామని వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నాకు దిగుతామని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తామని వివరించారు. రాష్ట్రంలో దిగజారిపోయిన పరిస్థితులు, దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వివరిస్తామని తెలిపారు.


పల్నాడులో అతికిరాతకంగా హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చారు. టీడీపీ గూండాలు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని, వైసీపీ సానుభూతిపరులను ఎంచుకుని మరీ దాడులకు తెగబడుతున్నారని జగన్ అన్నారు. రషీద్ ఒక సాధారణ యువకుడని, వైన్ షాపులో పని చేసే ఒక ఉద్యోగి అని వివరించారు. వైసీపీ సానుభూతిపరుడని నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరే వైసీపీ సానుభూతి పరుడైనా.. వారికి ఇలాంటి గతే పడుతుందని వారు బెదిరించారని తెలిపారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ స్వల్ప కాలంలోనే 36 రాజకీయ హత్యలు జరిగాయని, 300 హత్యా ప్రయత్నాలు జరిగాయని జగన్ వివరించారు. 560 ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారని, 490 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెయ్యికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని విమర్శించారు.


Also Read: రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. హైడ్రా చైర్మన్‌గా ముఖ్యమంత్రి

వినుకొండ ఎస్పీగా మంచి ఆఫీసర్ రవిశంకర్ ఉండేవారని, కానీ, ఎన్నికల వేళ వారి పలుకుబడితో ఎస్పీని మార్పించారని జగన్ తెలిపారు. ఎన్నికల అధికారులు మల్లికా గర్గ్‌ను ఎస్పీగా నియమించారని, కానీ, టీడీపీ ప్రభుత్వం ఆ అధికారిని కూడా మార్చేశారని వివరించారు. ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని, వారు కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఆటవిక పాలన నడుస్తున్నదని వివరించారు.

సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో తిరగకూడదా? అని జగన్ ప్రశ్నించారు. ఆయన రెడ్డప్ప ఇంటికి వెళ్లారని, ఆ ఇంటిని దిగ్బంధం చేశారని తెలిపారు. ఇంటి మీద రాళ్లు వేశారని, రెడ్డప్ప కారును కూడా కాల్చేశారని వివరించారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతూ ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులను పోలీసులు పట్టించుకోవడం లేదని, అగత్యాలు జరుగుతున్నా చూసి చూడనట్టు వెళ్లిపోతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెబుతా ఉన్నాడు కదా అని పోలీసులు వదిలేసిన పరిస్థితులు అని జగన్ పేర్కొన్నారు. కానీ, గతంలో వైసీపీ ప్రభుత్వం ఏనాడు కూడా టీడీపీ వాళ్లను చంపండని, కొట్టండని చెప్పలేదని తెలిపారు. టీడీపీ వాళ్లకు సంక్షేమ పథకాల లబ్ది అందకూడదనీ అనలేదని వివరించారు. అందరి సంక్షేమాన్ని కాంక్షించి పని చేశామని తెలిపారు.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×