BigTV English

Pawan Kalyan: చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్..పెద్దన్నయ్య అంటూ!

Pawan Kalyan: చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్..పెద్దన్నయ్య అంటూ!

Pawan Kalyan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు చిరంజీవి(Chiranjeevi) సరిగ్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు చిరంజీవి సినీ ప్రయాణం పై స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి 47 సంవత్సరాల సినీ ప్రయాణం గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.


ఆ క్షణాలను మాటల్లో వర్ణించలేను..

చిరంజీవితో పవన్ కళ్యాణ్ దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ..”ప్రాణం ఖరీదు” (Praanam Khareedhu)సినిమాలో పెద్దన్నయ్య హీరోగా నటించిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ సమయంలో మేము నెల్లూరులో ఉన్నాము అప్పుడు నేను ఇంకా స్కూల్లోనే ఉన్నాను. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మేము కనకమహాల్ థియేటర్ కు వెళ్లి సినిమా చూసిన ఆ క్షణాలను మాటల్లో చెప్పలేనని తెలిపారు. తన 47 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ అంతే వినయంగా ఉన్నారని ఆయన సహాయ స్వభావాన్ని ఎప్పటికీ కోల్పోలేదని తెలిపారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని, అన్నయ్యకు ఆరోగ్యంతో పాటు శ్రేయస్సుతో నిండిన పూర్తి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.

పదవీ విరమణ లేదు..


ఇక రాబోయే రోజులలో సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అన్నయ్యకు సినిమా ఇండస్ట్రీలో పదవి విరమణ అనేది లేదని, ఆయన కావాలనుకుంటే తప్ప పదవీ విరమణ రాదని తెలియజేశారు. పుట్టుకతో పోరాడే వాడే నా పెద్దన్నయ్య.. శంకర్ బాబును అందరూ ఆప్యాయంగా మెగాస్టార్ చిరంజీవి అని పిలుస్తారు అంటూ తన అన్నయ్య గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

చిరంజీవి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మంచి సక్సెస్ అందుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇలా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. 47 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు “మన శంకర వరప్రసాద్ గారు” అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: OG Movie: పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్.. అక్కడ షో క్యాన్సిల్!

Related News

OG Movie: పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్.. అక్కడ షో క్యాన్సిల్!

Vithika-Varu Sandesh: సొంతింటి కలను నెరవేర్చుకున్న వితిక దంపతులు..ఫోటోలు వైరల్!

‎OG Censor : ‘ఓజీ’ ఇట్స్ A సర్టిఫికేట్ మూవీ… అయినా రెండు నిమిషాలు కట్ చేశారు

Dharma Wife: రాత్రిళ్ళు మాత్రమే ఫ్లాట్‌కి వస్తుంది.. క్యారెక్టర్ లేదా? రీతు చౌదరిపై ధర్మా భార్య గౌతమి ఫైర్!

‎Bhagyashri Borse : నువ్వుంటే చాలు… రామ్‌ కోసం భాగ్యశ్రీ కూని రాగం… రిలేషన్ కన్ఫామా ?

OG Trailer Late : ట్రైలర్ లేట్ అవ్వడానికి కారణం DI, AI కాదు… అంతా ప్రశాంత్ వర్మనే

Naina Ganguly: కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించాడు… అందుకే ఇండస్ట్రీకి దూరం

Big Stories

×