IND Vs PAK : ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 171 పరుగులు చేసింది. అయితే టీమిండియా 172 పరుగులను 4 వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ విషయం తెగ వైరల్ కావడం విశేషం. టీమిండియా ఓపెనర్ అభిషేక్ వర్మ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం విధితమే.
Also Read : IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య
అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ చూసి.. ఓ పాకిస్తాన్ లేడీ అభిమాని అభిషేక్ వర్మ కి లవ్ ప్రపోజ్ చేసింది. పాకిస్తాన్ లేడీస్ ని కూడా మెప్పిస్తున్నారు రా మన ఆటగాళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మరో లేడీ తిలక్ వర్మకి కూడా ప్రపోజ్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటో వైరల్ కావడం విశేషం. మరోవైపు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కు ఓ అందమైన భారత అమ్మాయి కూడా ప్రపోజ్ చేసింది. ఇండియా నుంచి మ్యాచ్ చూసేందుకు దుబాయ్ వెళ్లిన సుజిత అనే యువతి మ్యాచ్ జరుగుతుండగానే లవ్ యూ అభిషేక్ శర్మ అంటూ అరిచేసింది. అంతేకాదు… ప్లైయింగ్ కిస్సులు పెట్టింది. ఇలా టీమిండియా క్రికెటర్లు అభిమానులను సంపాదించుకోవడం విశేషం.
తొలి బంతినే సిక్స్ గా మలిచాడు అభిషేక్ శర్మ. 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. మరోవైపు 28 బంతుల్లో 47 పరుగులు చేశాడు శుబ్ మన్ గిల్. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం డకౌట్ గా వెనుదిరగడం విశేషం. చివర్లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ 19 బంతుల్లో 30 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివర్లో టీమిండియా పై కాస్త ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిని తిలక్ వర్మ ఎక్కువ కానివ్వకుండా తన పని తాను చేశాడు. ముఖ్యంగా 17వ ఓవర్ లో 148 పరుగుల వద్ద సంజూ శాంసన్ 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యాతో కలిసి ముగించాడు తిలక్ వర్మ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అభిషేక్ శర్మ అందుకోగా.. ఇక ఎప్పటిలాగే మ్యాచ్ అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. పాకిస్తాన్ తో సూపర్ 4 మ్యాచ్ లో తిలక్ వర్మకు ఈ అవార్డు లభించింది. టీమిండియా త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర చేతుల మీదుగా తిలక్ అవార్డును అందుకున్నాడు.
https://www.facebook.com/share/1MSFPDF6m6/