E-Paper
Advertisement

Samsung Upcoming Budget Phone: సామ్‌సంగ్ కొత్త ఫోన్.. అతి తక్కువ ధరకే.. లాంచ్ ఎప్పుడంటే?

Samsung Upcoming Budget Phone: సామ్‌సంగ్ కొత్త ఫోన్.. అతి తక్కువ ధరకే.. లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Samsung Upcoming Budget Phone: టెక్ మేకర్ సామ్‌సంగ్ త్వరలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో సామ్‌సంగ్ గెలాక్సీ A06 కూడా ఉంది. ఈ బడ్జెట్ ఫోన్ మేలేషియన్ స్టాండర్డ్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ ఇన్‌స్టిట్యూట్ నుంచి ధృవీకరణ పొందింది. ఈ సామ్‌సంగ్ ఫోన్ ఎఫ్‌సిసి, బిఐఎస్ డేటా బేస్‌లో కనిపించింది. దీని ఆధారంగా ఫోన్ త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతం ఈ సర్టిఫికేషన్లు ఫోన్ ఫీచర్ల గురించి పెద్దగా వెల్లడించలేదు. దీని గురించి పూర్తి వివరానలు ఇప్పుడు తెలుసుకుందాం.

FCC ధృవీకరణ ఫోన్ మోడల్ నంబర్‌ను వెల్లడించింది. ఇది SM-A065F/DS మోడల్ నంబర్ కలిగి ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇది 4G LTE నెట్‌వర్క్‌కు సపోర్ట్ ఇస్తుంది. అంటే ఇది 5G స్మార్ట్‌ఫోన్ కాదు. ఇందులో 5జీ సిమ్ కార్డ్‌లు పనిచేయవు.

Advertisement

Also Read: Flipkart GOAT Sale 2024: కొత్త సేల్ స్టార్ అయింది.. ఈ ఫోన్లపై ఫుల్ డిస్కౌంట్స్!

సామ్‌సంగ్ గెలాక్సీ A06 గీక్‌బెంచ్‌లో కూడా కనిపించింది. దీని ప్రకారం MediaTek  Helio G85 ప్రాసెసర్‌ని ఫోన్‌లో ఇవ్వవచ్చు. సాధారణంగా ఈ ప్రాసెసర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. ఇప్పటి వరకు వచ్చిన నివేదికలు నిజమైతే ఈ గెలాక్సీ A06 ఫోన్ 4 GB RAMని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 14 OSలో రన్ అవుతుంది.

Advertisement

ఇతర లీక్‌ల గురించి మాట్లాడితే సామ్‌సంగ్ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు దేశంలో చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కంపెనీ Galaxy Z Fold 6, Galaxy Z Flip 6 ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమైన 24 గంటల్లోనే, పెద్ద సంఖ్యలో కస్టమర్‌లు వాటి కోసం ఆర్డర్‌లు చేశారు. ఈ నంబర్ సామ్‌సంగ్ ముందు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కంటే 40 శాతం ఎక్కువగా ఉందని కంపెనీ వెల్లడించింది.

Also Read: Oppo A3x: మైండ్ బ్లాక్.. ఒప్పో నుంచి కొత్త ఫోన్.. అదరగొడుతున్న ఫీచర్లు!

సామ్‌సంగ్ గెలాక్సీ Z Fold 6,  Z Flip 6 జూలై 10న సేల్‌కు వచ్చాయి. దీంతో దేశంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, గెలాక్సీ వాచ్ అల్ట్రా, గెలాక్సీ వాచ్ 7, గెలాక్సీ బడ్స్ 3, గెలాక్సీ బడ్స్ 3 ప్రోల విక్రయం జూలై 24 నుండి అందుబాటులోకి రానున్నాయి. Snapdragon 8 Gen 3 Galaxy Z Fold 6, Z Flip 6లలో ప్రాసెసర్‌ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Related News

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

Big Stories

Advertisement
×