BigTV English
Advertisement

Suryakumar Yadav: సూర్యాపైనే ఎందుకంత నమ్మకం అంటే..

Suryakumar Yadav: సూర్యాపైనే ఎందుకంత నమ్మకం అంటే..
Suryakumar confirmed as India’s T20I captain for Sri Lanka tour: టీమ్ ఇండియాలో ఆటగాళ్లకి, ప్రతిభకి ఎప్పుడూ కొదవ లేదు. కానీ 15మందిని ఎంపిక చేయడంలోనే చిక్కంతా వస్తోంది. ఇప్పుడా సమస్య కొంత తగ్గింది. ఎందుకంటే ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో తెలుసుకుంటూ మూడు ఫార్మాట్లకి మూడు జట్లను ఎంపిక చేయడం వల్ల దాదాపు 45 మందికి అవకాశం వస్తోంది. కాకపోతే ఇక్కడ రెండు, మూడు ఫార్మాట్లలో ఆడేవారున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 30 నుంచి 35 మంది ఆటగాళ్లు జాతీయ జట్టులో ఆడుతున్నారు. ఇది ఇండియా క్రికెట్‌కి ఒక శుభపరిణామం అని చెప్పాలి.

కాకపోతే రోహిత్ శర్మ టీ 20 కి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్లేస్‌ని హార్దిక్ పాండ్యాతో భర్తీ చేస్తారని అంతా అనుకున్నారు. కాకపోతే సూర్యకుమార్ యాదవ్ పేరు కూడా ప్రతిపాదనలోకి రావడంతో ఓటింగ్‌కి వెళ్లారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. అక్కడ బీసీసీఐ సెలక్షన్ కమిటి, కోచ్, కెప్టెన్ వీరే ప్రధాన పాత్ర పోషించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు బీసీసీఐ కూడా నూతన విధానాలను అనుసరించింది. ఇప్పుడు ఆటగాళ్ల ప్రతిపాదన కూడా తీసుకుంది. ప్రజాస్వామ్య దేశ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.


దీంతో దాదాపు 70శాతం సూర్యకుమార్ కి ఓట్లు పడ్డాయని తెలిసింది. ఇక మరోమాటకు ఆస్కారం లేకుండా ఏక నిర్ణయం తీసుకున్నారు. గ్రౌండ్ బయట ఏసీ గదుల్లో కూర్చుని చెప్పే తమ అభిప్రాయాలు, డిస్కషన్లు, డిబేట్లు అన్నీ పక్కన పెట్టారు. గ్రౌండ్ లోపల కష్టపడి ఆడేవారి అభిప్రాయాలకు విలువిచ్చి సూర్యకుమార్ ని కెప్టెన్ ని చేశారు.

అందుకు ప్రధాన కారణం ఒకటేనని చెబుతున్నారు. సూర్యా జట్టుతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎవరికే కష్టం వచ్చినా తను ముందుంటాడు. మేనేజ్మెంట్ తో మాట్లాడేందుకు వెనుకాడడు. ఆటలో విఫలమవుతున్నా అవకాశాలిస్తాడు. నేనున్నానంటూ ధైర్యం చెబుతాడు. తన సహజశైలిలోనే ఆడమని సూచిస్తాడు. అందుకు ఉదాహరణ కూడా చెబుతున్నారు.


Also Read: నటాషాతో విడాకులు ప్రకటించిన హార్దిక్ పాండ్యా

సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ మానసికంగా ఇబ్బంది పడుతూ ఇండియాకి తిరిగి వెళ్లిపోతానని మొదలెట్టాడు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ తనకెంతో నచ్చచెప్పాలని చూశాడు. ఆపడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఇంత కష్టపడి, ఈ స్థాయికి వచ్చి, చిన్నచిన్నవాటికి కెరీర్ ని రిస్క్ లో పెట్టుకోవద్దని సూచించాడు. అదే మరొక  కెప్టెన్ అయితే, నీ ఖర్మ, నీ ఇష్టం అని వదిలేస్తారని అంటున్నారు. అలా సూర్యాకి మంచి మార్కులు పడ్డాయని అంటున్నారు.

ఇకపోతే రోహిత్ శర్మ కూడా ఫ్రెండ్లీ కెప్టెన్ గా ఉంటాడని అంటున్నారు. అందుకే తన కెప్టెన్సీలో ఆటగాళ్లు సహజసిద్ధమైన ఆట ఆడతారని, వందకి, రెండొందల శాతం మనసు పెట్టి ఆడతారని అంటున్నారు. కెప్టెన్ కి ఎప్పుడూ జట్టు సహకారం ఉన్నప్పుడే ఆటలో విజయాలు దక్కుతాయనే సిద్ధాంతం మేరకు సూర్యాకి కెప్టెన్ గా అవకాశం వచ్చింది. అయితే హార్దిక్ పాండ్యాకి వైస్ కెప్టెన్ గా కూడా నియమించలేదు. గిల్ కి రెండు ఫార్మాట్లలో అవకాశం ఇచ్చారు. ఆటగాడిగా కాకుండా, కేవలం  ఫిట్ నెస్ కారణంగానే హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టారని అంటున్నారు.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×