BigTV English

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ కోసం ఇప్పుడు ఆధార్ సేవా కేంద్రాల చుట్టూ తిరగక్కర్లేదు. ఈ నెల 23 నుంచి 26 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ నమోదుకు అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, వివరాల సవరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాల ఏర్పాటు చేస్తున్నారు.


నాలుగు రోజుల పాటు

ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే సాఫ్ట్ వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు.

కొత్తగా ఆధార్ కార్డు నమోదు, అప్ డేట్ అంటే చాలా శ్రమతో కూడిన పని. ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఒక్కసారి సర్వర్ సమస్యలతో రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది. పిల్లల ఆధార్ నమోదు కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ లో వివరాలు ఒకే విధంగా ఉండాలి. లేకుంటే రిజెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామాల్లోనే ఆధార్ నమోదు, అప్డేట్‌కు అవకాశం కల్పించనుంది.


సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు

స్కూళ్లకు దసరా సెలవులు ఇచ్చారు. విద్యార్థులు సొంతూళ్లకు బయలు దేరుతారు. ఈ క్రమంలో ఆధార్ అప్డేట్, కొత్త కార్డు నమోదు వంటి పనులు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. నాలుగు రోజుల పాటు సచివాలయాల్లో ఆధార్ నమోదు, అప్‌డేట్ కు అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు 4 రోజుల పాటు రాష్ట్రంలో ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాలలో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంపుల్లో నూటికి నూరు శాతం ఆధార్‌ నమోదు, అప్డేట్స్ పూర్తి చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో, డీఎల్‌డీవోల పర్యవేక్షణలో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు.

Also Read: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

ఆధార్ అప్డేట్ తప్పనిసరి

ఐదేళ్లు నిండిన చిన్నారులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. అలాగే ఇప్పటి వరకూ ఆధార్ నమోదు చేసుకోని వారు ఈ క్యాంపులను వినియోగించుకోవాలని కోరుతుంది.

ఈ క్యాంపుల కోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్‌, బయోమెట్రిక్‌ వినియోగం, ఫొటో, ఇతర వివరాలు ఎలా నమోదు చేయాలో సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు 4 రోజుల పాటు ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు.

 

Related News

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Big Stories

×