BigTV English

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో ఈ భేటీ జరిగింది. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ఛాంబర్‌కు లోకేష్ వచ్చారు. ఆయనతో కాసేపు మాట్లాడి బయటకు వచ్చారు. లోపల జరిగిన భేటీపై లోకేష్ టీమ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.


డీఎస్సీ వేడుకకు ఆహ్వానం..
ఈనెల 25న డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించాలనుకుంటోంది. ఇటీవల వర్షాల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి ఈనెల 25న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా డిప్యూటీ సీఎంని కోరినట్టు నారా లోకేష్ తెలిపారు. ఆయనే స్వయంగా ఈ భేటీ గురించి ఓ ట్వీట్ వేశారు.

పవన్ అన్న.,
“రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నను ఆయన ఛాంబర్ లో ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ అన్నను ఆహ్వానించాను. గత అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు 87 కేసులు వేశారు. కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాది లోనే ఇచ్చిన మాట నిలుపుకుంది. దీనివల్ల ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారం అయ్యాయని చెప్పాను.” అంటూ లోకేష్ ట్వీట్ వేశారు.


తొలి హామీ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం హోదాలో చంద్రబాబు పెట్టిన తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే. ఏడాదిన్నరలోపే డీఎస్సీ నోటఫికేషన్ విడుదల చేయడం, పరీక్ష పెట్టడం, సెలక్షన్ లిస్ట్ బయటకు రావడం, చివరకు నియామక పత్రాల జారీ కూడా పూర్తి కాబోతోంది. తొలి హామీని పగడ్బందీగా అమలు చేశామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేయాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీసీఎం, ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

రాజకీయాల సంగతేంటి?
పవన్ కల్యాణ్, లోకేష్ మధ్య ఏపీ రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కూటమి పార్టీల మధ్య సయోధ్య, ప్రతిపక్ష ఆరోపణల గురించి కూడా ఇద్దరు చర్చించారని అంటున్నారు. అయితే లోకేష్ మాత్రం కేవలం తన ఆహ్వానానికి సంబంధించి మాత్రమే ట్వీట్ వేయడం గమనార్హం.

ఓజీ సక్సెస్ కావాలి..
పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్న నేపథ్యంలో ఓజీ హిట్ కావాలని పవన్ కి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు తెలుస్తోంది. అటు జనసేన నుంచి కూడా అధికారికంగా ఈ భేటీపై ఓ ట్వీట్ పడింది. మంత్రి నారా లోకేష్, డీఎస్సీ నియామక పత్రాల జారీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంని ఆహ్వానించారంటూ ఆ ట్వీట్ లో జనసేన పేర్కొంది.

Related News

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Big Stories

×