BigTV English

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని రాసిన లేఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సీఎం ఆదేశాలతో భువనగిరి- యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావును స్వయంగా నళిని ఇంటికి వెళ్లారు. కలెక్టర్ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉంది..? ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యింది..? ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఎలా రియాక్ట్ అయ్యారు..? అన్న అంశాలపై కలెక్టర్ ఆమెతో సుదీర్ఘంగా చర్చించారు.


నళినితో మాట్లాడిన అనంతరం కలెక్టర్ హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం మెరుగు పడుతోందని కలెక్టర్ అన్నారు. నళినికి ప్రభుత్వానికి అండగా ఉంటుందని చెప్పారు. ఆమె వైద్య ఖర్చులు, అంతకు ముందు అయిన ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. నళినికి ఇటీవల కాలంలో వరుసబెట్టి డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్, చికెన్ గెన్యూ రావడంతో ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు.

యోగా, ఆయుర్వేదంతో నళిని ఆత్మ విశ్వాసంతో ఉన్నారని కలెక్టర్ వివరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుండాలని కోరుతున్నట్టు చెప్పారు. ఆమె ఆరోగ్యం విషయంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో అయినా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు వాడిని మందులకు పెద్దగా ఖర్చు ఎక్కువగా కాలేదని నళిని చెప్పినట్టు కలెక్టర్ మీడియాతో చెప్పారు.


ఇప్పటివరకు అయిన వైద్యానికి సాయం అవసరం లేదని.. తన ఉద్యోగ సర్వీస్ నిబంధనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆమె కోరినట్టు చెప్పారు. నళిని తండ్రి యోగా మాస్టర్, ఆయుర్వేదం మెడిసన్ గురించి వారికి బాగా తెలుసు అందుకే ఆత్మవిశ్వాసంతో ఉన్నారని కలెక్టర్ హనుమంతారావు మీడియాకు వివరించారు.

ALSO READ: EMRS Recruitment: ఈ ఉద్యోగం కొడితే గోల్డెన్ లైఫ్.. మొత్తం 7,267 ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు భయ్యా

అంతకు ముందు రోజు నళిని మరణ వాంగ్మూలం పేరుతో పేస్ బుక్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ‘ఒక అధికారిణి గా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవిక గా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. నా జీవితం ముగిసిపోతుంది. సాయం కోసం నేను సీఎంకు పెట్టిన దరఖాస్తు చెత్తకుండి పాలైంది. ఇప్పటి వరకు నన్ను ఏ నాయకుడూ సన్మానించింది లేదు. నేను చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం దయచేసి నా పేరు వాడుకోవద్దు. ఇప్పటివరకు ప్రధాని మోదీని కలవలేకపోయాను. చనిపోయాకర నా లక్ష్య సాధన కోసం ప్రధాని మోదీ ఏమైనా చేయాలి. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు సాయం చేయండి. వచ్చే జన్మలో మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తా’ అని నళిని తన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.

ALSO READ : HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Related News

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×