OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ(OG). సుజీత్ (Sujeeth)దర్శకత్వంలో ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు విడుదల చేసిన ట్రైలర్ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమా సెలబ్రేషన్లకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి తాజాగా సెన్సార్ బృందం కూడా ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అదేవిధంగా కొన్ని హింసాత్మక, అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా మొత్తం 154ని 15 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమైన నేపథ్యంలో ఏపీ సర్కారు నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో పెయిడ్ ప్రీమియర్లకు అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే. అదే విధంగా టికెట్ల రేట్లు కూడా పెంచుతూ అనుమతులు తెలిపారు. ఇక ఈ సినిమా మరొక రెండు రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది.
ప్రీమియర్లకు అనుమతి తెలిపిన ఏపీ సర్కార్..
ఏపీలో ముందుగా 25వ తేదీ రాత్రి ఒంటిగంట షోకు అనుమతులు తెలిపారు. అయితే ఈ షో క్యాన్సిల్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా 25వ తేదీ రాత్రి ఒంటి గంటకు ప్రసారం కావలసిన ఈ షో క్యాన్సిల్ చేస్తూ.. 24వ తేదీ రాత్రి 10 గంటల ప్రీమియర్ కు అనుమతులు తెలిపారు. ఇలా 25వ తేదీ ఒంటిగంటకు షో క్యాన్సిల్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమేర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏపీ సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.
ఓజీ పైనే ఆశలు…
ఈ సినిమా 25వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచిన నేపథ్యంలో అభిమాను ఓజీ పైనే ఆశలు పెట్టుకున్నారు. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్, శ్రీయ రెడ్డి వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మరి 25వ తేదీ రాబోతున్న ఓజీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Vithika-Varu Sandesh: సొంతింటి కలను నెరవేర్చుకున్న వితిక దంపతులు..ఫోటోలు వైరల్!