BigTV English

Trolling On Roja: రోజా కంటతడికి రోజా మాటలే సమాధానం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

Trolling On Roja: రోజా కంటతడికి రోజా మాటలే సమాధానం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

“విధి ఎవ్వడినీ విడిచిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది. మనం ఏం చేస్తే అది మనకు తిరిగి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు మనం ఎవర్ని ఏదైనా అంటాం. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడ్పులు ఏడ్చే నిన్ను ఎవరూ జాలితో చూడరని గుర్తుంచుకో.” గతంలో చంద్రబాబుని ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలివి. అయితే ఇప్పుడీ వ్యాఖ్యలు మరోసారి హైలైట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దొంగ ఏడుపులు అనే పాయింట్ ని హైలైట్ చేస్తూ నెటిజన్లు రోజా వీడియోని వైరల్ చేస్తున్నారు.


అప్పుడలా.. ఇప్పుడిలా..
మీడియా ముందు ఏడిస్తే దొంగ ఏడుపులు అంటూ రోజా గతంలో చాలా సార్లు చెప్పారు. కష్టం ఎదురైతే ధీటుగా ఎదుర్కోవాలని, ఏడవడం సరికాదని చాలామందిని కామెంట్ చేశారు. అలాంటి రోజా.. ఇటీవల వైసీపీ సొంత మీడియా ఛానెల్ లో జరిగిన చర్చలో కంటతడి పెట్టారు. సహజంగా మహిళా నేత కంటతడి పెడితే ఎవరైనా సానుభూతి చూపిస్తారు. ఆమెకు మద్దతుగా వీడియోలు పోస్ట్ చేస్తారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజాపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఎందుకంటే గతంలో ఆమె ఏడ్చే రాజకీయ నాయకుల గురించి చేసిన కామెంట్లు అలాంటివి మరి. ఆమె కామెంట్లను, ఆమె వీడియోకే సమాధానంగా పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

అసలేమైంది..?
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు రోజా. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా ప్రదర్శించారు. ఆయనపై పోలీస్ కేసు కూడా పెట్టారు. ఈ క్రమంలో టీవీ ఛానెల్ లో జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె.. గతంలో కూడా తనపై తప్పుడు పోస్ట్ లు పెట్టారని, ఫేక్ ఫొటోలు ప్రచారం చేశారని, వాటిని తన కుటుంబ సభ్యులకు కూడా పంపించి వికృతానందం పొందారంటూ కంటతడి పెట్టారు. అదే సమయంలో ఎమ్మెల్యే భానుప్రకాష్ వర్గం కూడా రోజా పాతవీడియోలను వైరల్ చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు రోజా చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను బయటకు తీశారు. అందులో బూతులు కూడా ఉన్నాయి. బూతులే కాదు, మరీ జుగుప్సాకరంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో ఈ వివాదంలో తప్పెవరిది అని తేల్చి చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముందు రోజానే తమ నేతపై తప్పుగా మాట్లాడారని గాలి భానుప్రకాష్ వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజా మీడియా ముందు వాపోయారు.

రోజా తిట్టారు. రోజా తిట్టించుకున్నారు. కానీ ఇక్కడ ఆమె విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ సింపతీ కోసం ట్రై చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. రోజా వీడియోలను మరోసారి వైరల్ చేస్తూ ఆమె చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు నెటిజన్లు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయిన తర్వాత మరోలా మాట్లాడకూడదంటున్నారు. రోజా ఒకవేళు ఎత్తి చూపితే, నాలుగు వేళ్లు ఆమెను చూపిస్తున్నాయనే విషయం మరచిపోకూడదంటున్నారు. మొత్తమ్మీద రోజా వీడియోలు మాత్రం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Turakapalem mystery: ఆ ఊరికేమైంది? 20 మరణాల మిస్టరీ ఏమిటి? రంగంలోకి సీఎం..!

Chandrababu: చంద్రబాబుకి అమరావతికంటే ఇష్టమైన ప్రదేశం ఏంటి?

AP Assembly 2025: 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ వచ్చేనా?

AP Fact Check: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ హంగామా… వాస్తవం ఏంటో తెలుసా?

Big Stories

×