Grah Gochar: ఆగస్టులో జరిగే గ్రహ సంచారం చాలా ముఖ్యమైనది. సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాల రాశి మార్పు ఈ నెలను చాలా ప్రత్యేకంగా మారుస్తుంది. అంతే కాకుండా ఇది 12 రాశుల వారి జీవితాల్లో అనేక రకాల ప్రభావాలను తెస్తుంది. ఆగస్టులో సూర్యుడు కర్కాటక, సింహరాశిలో ఉంటాడు. ఫలితంగా చాలా మందికి ఇది కొత్త శక్తిని, విశ్వాసాన్ని ఇస్తుంది. అదే సమయంలో.. రాక్షసుల గురువు శుక్రుడు మిథునరాశి, కర్కాటకంలో ఉండటం వల్ల ప్రేమ, సంబంధం, ఆర్థిక విషయాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
అంతే కాకుండా ఆగస్టులో కుజుడు కన్యారాశిలో ఉంటాడు. ఇది ఆఫీసుల్లో మీ కృషిని ప్రోత్సహిస్తుంది. శని మీనంలో తిరోగమనంలో ఉంటాడు. ఇది సహనం, అవగాహన అవసరాన్ని పెంచుతుంది. రాహువు, కేతువు వరుసగా కుంభ, సింహ రాశిలో ఉంటారు. మీ జీవితంలోని వివిధ రంగాలలో ఊహించని మార్పులను తెస్తుంది. బుధుడు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ అస్తమిస్తాడు, దీని కారణంగా కమ్యూనికేషన్ , ఆలోచనలలో కొంత సంక్లిష్టత ఉంటుంది. ఈ నెలలో గ్రహాల స్థానాల కారణంగా.. కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
శని గ్రహం యొక్క మొదటి దశ సాధేశతి జరుగుతున్నప్పటికీ, దాని తిరోగమన స్థానం ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది మీ పనిలో విజయాన్ని తెస్తుంది. కుజుడు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా వ్యాపారంలో లాభాలు కూడా పెరుగుతాయి. కొత్త పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.
సింహ రాశి:
ఆగస్టు మధ్యలో.. సూర్యుడు తన రాశిచక్రం సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అంతే కాకుండా కెరీర్‌లో గణనీయమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీని కారణంగా మీరు పెద్ద బాధ్యతలను పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొత్త పనిని ప్రారంభించడానికి అంతే కాకుండా ఉద్యోగాలను మార్చడానికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. శని యొక్క తిరోగమన దృష్టి స్థిరత్వం, శాంతిని కొనసాగించడంలో సహాయపడుతుంది.
Also Read: ఈ వాస్తు టిప్స్ పాటిస్తే.. డబ్బుకు ఏ లోటు ఉండదు
తులారాశి:
శుక్రుడు ఆగస్టులో మిథునరాశి, కర్కాటక రాశిలో ఉండటం వల్ల గజలక్ష్మి, లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరుస్తాడు. దీని కారణంగా కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అందం, కళ, ప్రేమ, వివాహంలో శుభాలు కలుగుతాయి. ఆర్థిక బలంతో, పనికిరాని ఖర్చులు తగ్గుతాయి. అంతే కాకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఉన్నతాధికారుల నుంచి కూడా ప్రశంసలు కూడా అందుకుంటారు. అంతే కాకుండా ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా నెరవేరతాయి. పెట్టుబడుల నుంచి లాభాలు కూడా అందుకుంటారు. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం.