E-Paper
Advertisement

Tata-Ernakulam Train Fire: ఎర్నాకుళం రైలు ఘటన.. ప్రత్యక్షసాక్షి కీలక విషయాలు, రాకపోకలకు అంతరాయం

Tata-Ernakulam Train Fire: ఎర్నాకుళం రైలు ఘటన.. ప్రత్యక్షసాక్షి కీలక విషయాలు, రాకపోకలకు అంతరాయం
Advertisement

Tata-Ernakulam Train Fire: టాటా-ఎర్నాకులం రైలు ఘటనలో ఏం జరిగింది? ప్రయాణికులు ఏం చెబుతున్నారు? ప్రయాణికులు అలర్ట్ కాకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది? ప్రత్యక్షసాక్షి చెప్పిన కీలక విషయాలేంటి? ఈ ఘటనపై దర్యాప్తు కోసం రైల్వే అధికారులు రంగంలోకి దిగేశారు.

ఎర్నాకుళం రైలు ఘటన.. ప్రత్యక్షసాక్షి కీలక విషయాలు

Advertisement

కేవలం బస్సులే కాదు.. రైళ్లు సైతం అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయని. తాజాగా టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రైలులో అగ్నిప్రమాదం అర్ధరాత్రి 12.40 గంటలకు మంటలు వ్యాపించినట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు ‘బిగ్ టీవీ’తో స్వయంగా చెప్పాడు.

తాను దువ్వాడ నుంచి సేలంకు ట్రావెల్ చేస్తున్నానని తెలిపాడు. సరిగ్గా రాత్రి 12. 40 గంటల సమయంలో ఫైర్ వచ్చినట్టు తెలిపాడు. ఆ సమయంలో మా కోచ్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింద న్నాడు. తోటి ప్రయాణికులను అలర్ట్ చేసి జాగ్రత్తగా దిగాలని చెప్పాము. తాము ఉన్న కోచ్‌కి ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ సేఫ్‌గానే ఉన్నారని చెప్పాడు.

Advertisement

అసలు ప్రమాదం ఎలా జరిగింది?

అగ్నిప్రమాద ఘటనను తొలుత ప్రయాణికులు గుర్తించారు. ఆ సమయంలో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలు తీవ్రంకావడంతో ఎలమంచిలి వద్ద చైన్ లాగారు రైల్వే సిబ్బంది. రైలు ఆగి ప్రయాణికులు దిగేసరికి రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఈలోగా అధికారులు మంటలు మిగతా బోగీలకు వ్యాపించకుండా రైలు నుంచి ఆ రెండు బోగీలను తొలగించారు.

నాలుగు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. దాదాపు రెండుగంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికుల సామానులు పూర్తిగా దగ్గమయ్యాయి. ఘటన గురించి తెలియగానే ఎకాఎకీన రైల్వే అధికారులు ఘటన జరిగిన ప్రమాదానికి చేరుకున్నారు.

ALSO READ:  టాటా-ఎర్నాకులం రైలులో భారీ అగ్నిప్రమాదం.. దగ్దమైన రెండు ఏసీ బోగీలు

రెండు ఎఫ్ఎస్ఎల్ బృందాలు, దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ అక్కడికి వచ్చారు.  అంతకుముందే ఘటన స్థలానికి చేరుకున్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. అగ్నికి ఆహుతైన బోగీలను పరిశీలించారు ఎస్పీ, రైల్వే సేఫ్టీ కమిషనర్. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత రెండు బోగీలను పక్కనపెట్టేసి రైలును సామర్లకోటకు తరలించారు.

ఘటన సమయంలో బీ1 బోగీలో 75 మంది, ఎం2 బోగీలో 82 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రెండు బోగీల్లోని 157 మంది ప్రయాణికులను స్వస్థలాలకు పంపేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులను సామర్లకోట నుంచి మరో రైలులో తరలిస్తామని అనకాపల్లి ఎస్పీ తెలిపారు. అక్కడ రైలుకి రెండు కోచ్‌లను అటాచ్ చేశారు.

మృతుడి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు ఎస్పీ. మరోవైపు విశాఖ నుంచి రాజమండ్రి వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.  రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఆగిపోయిన రైళ్లు ఒకొక్కటిగా కదులుతున్నాయి.  జన్మభూమి సూపర్ ఫాస్ట్, వందేభారత్ రైళ్లు యథావిధిగా బయలుదేరాయి.

ఆలస్యంగా నడుస్తున్న వాటిలో పూరి-తిరుపతి,  షాలిమార్-చర్లపల్లి, విశాఖ-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. పలు పాసింజర్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.  మరోవైపు రైలు ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. అధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  ఈ ప్రమాదంలో ఒకరు చనిపోవడం బాధాకరమన్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎలమంచిలి అగ్నిప్రమాదానికి గురైన ఎర్నాకులం రైలు కోచ్‌లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్. బ్రేక్ వేసిన సమయంలో ప్రెషర్ లో డిఫరెన్స్ రావడం వల్ల లోకో పైలట్ ప్రమాదాన్ని గుర్తించాడని చెప్పారు జిల్లా కలెక్టర్. ప్రమాదానికి కారణాలు ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసే అవకాశం ఉందన్నారు. ప్రమాదంలో చనిపోయిన చంద్రశేఖర్ సుందరం కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఎర్నాకుళంకు ట్రైన్ స్టార్ట్ చేసి ప్రయాణికులను పంపిస్తున్నామని, ప్రయాణికులకు కావలసిన మిల్క్, బిస్కెట్స్ అందించామని తెలిపారు.

 

Related News

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Big Stories

Advertisement
×