BigTV English

Clashes between students in Eluru: ఏలూరు స్కూల్‌లో దారుణం.. తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి.. ఆ తర్వాత

Clashes between students in Eluru: ఏలూరు స్కూల్‌లో దారుణం.. తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి.. ఆ తర్వాత

Clashes between students in Eluru: విద్యార్థుల మధ్య ఏం జరిగిందో తెలీదు.. ఓ విద్యార్థిపై మరొకరు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు మరో విద్యార్థి. గాయాలపాలైన ఆ విద్యార్థిని నిర్వాహకులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. సంచలనం రేపిన ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది.


ఉండి మండలానికి చెందిన ఓ బాలుడు ఏలూరులోని జేవియర్ హైస్కూల్‌లో చదువుతున్నాడు. దానికి అనుబంధంగా హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆ గదిలోనే మరో స్టూడెంట్ ఉంటున్నారు. ఇద్దరి మధ్య దోమల చక్రం విషయంలో గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనేస్థాయికి వెళ్లింది.

ఓ విద్యార్థి పట్టరాని కోపంతో సీసాతో తెచ్చిన పెట్రోల్‌ని తోటి విద్యార్థిపై పోసి నిప్పుంటించాడు. మంటలు రావడం గమనించిన సీనియర్ స్టూడెంట్స్ వెంటనే మంటలు ఆర్పి నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. గాయాలపాలైన విద్యార్థి సుధీర్‌పాల్‌ని వెంటనే ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.


ప్రస్తుతం ఆ విద్యార్థి అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. విద్యార్థి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెట్రోల్ పోసిన బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: ‘రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా..?’

వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలే ఈ ఘటనకు దారి తీసిందని తోటి విద్యార్థులు చెబుతున్నమాట. అంతేకాదు పెట్రోల్ పోసిన విద్యార్థి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×