Raghu Veera Reddy: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. ఒకప్పుడు దగ్గరైనవన్నీ.. తర్వాత రోజుల్లో దూరమవుతాయి. అలాంటి సందర్భాలు ఉన్నాయి. మన కళ్ల ముందు ఎంతో మందిని చూస్తాము.. చూస్తుంటాము కూడా. అందుకు ఎగ్జాంఫుల్ మన కళ్ల ముందు కనిపిస్తున్న వ్యక్తి ఎవరోకాదు మాజీ మంత్రి రఘువీరారెడ్డి.
మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమైన నేత. ప్రస్తుతం సాదారణ జీవితం గడుపుతున్నారు. తన ఊర్లోవున్న భూమిలో పంటలు పండించు కుంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే సాధారణ జీవితం గడుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాలంటే చిన్న మోపెడ్ మీద ట్రావెల్ చేస్తున్నారు.
వేరే జిల్లాలకు రాష్ట్రాలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సును ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ రఘువీరారెడ్డి సొంతూరు అనంతపురం జిల్లా. నీలకంఠాపురం ఆయన గ్రామం. చంద్రబావి గేట్ నుంచి బెంగళూరుకు సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేశారు. బస్సులో రాజకీయ అవగాహన ఉన్నవారు ఆయన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మడకశిర నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రఘువీరారెడ్డి. ఆ తర్వాత కల్యాణ దుర్గం నియోజకవర్గానికి మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు అభిమానం అంతాఇంతా కాదు. ఆ అభిమానమే రాజకీయాల్లోకి వచ్చేటట్టు చేసింది. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ కేబినెట్‌లో పని చేసిన అనుభవం ఆయన సొంతం.
ALSO READ: తిరుపతిలో బాధితులకు మంత్రులు పరామర్శ.. కుటుంబాలకు సాయం, పవన్ ఎక్కడంటూ విపక్షం ప్రశ్నలు
ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్‌గా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. వ్యవసాయ వృత్తిని చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు పండుగలు, ఊర్లో జరిగిన ఫెస్టివల్ సందర్భంగా కనిపిస్తారు. ఆ తర్వాత తన పని తాను చేసుకుపోతారు. రాజకీయాల గురించి ఎవరైనా మాట్లాడినా లైట్ నవ్వి సైలెంట్ అయిపోతారు. రాజకీయాల్లోకి చాలామంది వస్తారు.. కానీ నేతలు కొద్దిరోజులు మాత్రమే అధికారంలో ఉంటారు. ఆ తర్వాత సాధారణ జీవితమే.