BigTV English

Tirupathi Stampede: తిరుపతిలో బాధితులకు మంత్రులు పరామర్శ.. కుటుంబాలకు సాయం, పవన్ ఎక్కడంటూ విపక్షం ప్రశ్నలు

Tirupathi Stampede: తిరుపతిలో బాధితులకు మంత్రులు పరామర్శ.. కుటుంబాలకు సాయం, పవన్ ఎక్కడంటూ విపక్షం ప్రశ్నలు

Tirupathi Stampede: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘనటపై టీటీడీతోపాటు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. గురువారం ఉదయం స్విమ్స్, రుయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. కోలుకుంటున్నవారితో మాట్లాడారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.


వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలో తొక్కిసలాట ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఘటన తొందరపాటు చర్యా ? సమన్వయ లోపమా? అనేది విచారణ లో తేలుతుందన్నారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామన్నారు.

మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపుతున్నట్లు తెలిపారు. అంత్యక్రియలకు తగిన సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు మరో మంత్రి అనగాని సత్యప్రసాద్. వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసిందన్నారు మరో మంత్రి అనిత.


ప్రాణాలను కాపాడబోయిన సమయంలో జరిగిన సంఘటనని, మొత్తం ఆరు మంది మరణించారు. ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు అధికంగా ఉన్నారన్నారు. ఎవరిది వైఫల్యమనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుంద న్నారు. ఇది ప్రమాదమా..  కుట్ర కోణామా అనే విషయం విచారణలో వెల్లడవుతుందని చెప్పుకొచ్చారు.

ALSO READ:  తిరుపతి తొక్కిసలాటపై ప్రభుత్వానికి నివేదిక.. ఘటన వెనుక ఆ ఇద్దరే?

ఈ ఘటనపై ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రి‌ చంద్రబాబుకు అధికారులు ఇచ్చారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులో జరగకుండా చూస్తామన్నారు. పరిస్థితిని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలని, ఈ విషయంలో చేయవలిసిన న్యాయం చేస్తామన్నారు.

బాధితులను పరామర్శించిన వారిలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి అనిత, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పి సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, ఆర్డిఓ రామ్మోహన్ వంటి వారు ఉన్నారు.

ఈ ఘటనపై వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ మాజీ భూమన కరుణాకరరెడ్డి రియాక్ట్ అయ్యారు. నెల రోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. పని చేసేవాళ్ళు తక్కువై పోయారని, పర్యవేక్షించేవారు ఎక్కువై పోయారన్నారు. ఈ విషయంలో టీటీడీ, పోలీసులు, నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పని చేశామని, ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా అద్భుతంగా నిర్వహించామన్నారు. మీరు చేస్తున్న తప్పులకు భక్తులకు కష్టాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరికు సీఎం చంద్రబాబు సేవ తప్పా, భక్తులు సేవ లేదన్నారు. బ్రేక్ దర్శనాలు 7 వేలకు పైగా ఇస్తున్నారని దుయ్యబట్టారు. దీనికి పూర్తి బాధ్యత అడిషనల్ ఈవో వహించాలన్నారు.

భక్తుల సేవకు 15 మంది పోలీసులు లేరని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే 2వేల మందికి పైగా మోహరించారని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని రెండు రోజులు నుంచి పది రోజులకు పెంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

తమిళనాడు శ్రీరంగంలో పది రోజులు దర్శనం తరహాలో తిరుమలలో అమలు చేశామన్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ స్థాయి పోలీసులు, అడిషనల్ ఈవోలను సస్పెండ్ చేయాలన్నారు. సనాతన ధర్మం పరిరక్షిస్తాను అని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు ఎత్తాలన్నారు. ఇప్పుడు ఆయన ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు భూమన. తిరుమల పవిత్రతను తాము కాపాడినట్లు, ఎవరు చేయలేరన్నారు.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×