E-Paper
Advertisement

Margani Bharat’s follower: రాజమండ్రిలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్త .. యాంకర్ కావ్యశ్రీ, ఆమె తండ్రిపై దాడి

Margani Bharat’s follower: రాజమండ్రిలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్త .. యాంకర్ కావ్యశ్రీ, ఆమె తండ్రిపై దాడి
Advertisement

Margani Bharat’s follower: రాజమండ్రిలో వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడు రెచ్చిపోయాడు. బూతులు తిడుతూ దాడి చేశాడు. డబ్బులు విషయంలో తలెత్తిన చిన్న వివాదం తారాస్థాయికి చేరింది. చివరకు పట్టరాని కోపంతో యాంకర్ కావ్యశ్రీ, ఆయన తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తే..

యాంకర్ కావ్యశ్రీ ఫ్యామిలీ రాజమండ్రిలో ఉంటోంది. కోనసీమలో ఈవెంట్ యాంకరింగ్ చేసేందుకు కావ్యశ్రీ, ఆమె తండ్రి వచ్చారు. సీన్ కట్ చేస్తే… కావ్యశ్రీ ఫాదర్ వద్ద మూడేళ్ల కిందట వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడు నల్లూరి శ్రీనివాస్ అప్పు రూపంలో కొంత మనీ తీసుకున్నాడు.

Advertisement

రోజులు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో రాజమండ్రిలో ఉన్న నల్లూరు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు కావ్యశ్రీ,ఆయన తండ్రి. ఇరువురు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో పట్టరాని కోపంతో యాంకర్ కావ్యశ్రీ, ఆయన తండ్రిపై దాడికి పాల్పడ్డాడు వైసీపీ కార్యకర్త.

తన ఇంటికి వచ్చి రచ్చ చేస్తారా అంటూ ఆవేశంతో ఊగిపోయారు శ్రీనివాసరావు. ఈ ఘటనపై బాధితులు వైసీపీ నేత శ్రీనివాస్‌పై ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గొడవ జరిగిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

ALSO READ: స్వరూపానంద ఎక్కడా? ఆ నగరాల మధ్య చక్కర్లు.. లెక్కల్లో తేడాలొచ్చాయా?

 

మరోవైపు ఏపీలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ వైసీపీ గొంతెత్తుతోంది. ఈ వ్యవహారంపై ఆ పార్టీ అధినేత ఏమంటారు? ఇంటికి వచ్చిన అడగడంతో కోపం వచ్చి కొట్టాడని అధినేత సమర్థించుకుంటారా? చిన్న వ్యవహారమేనని లైట్‌గా తీసుకుంటారో చూడాలి.

 

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×