BigTV English
Advertisement

Sirisha Lella: నారా రోహిత్ కాబోయే భార్య ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

Sirisha Lella: నారా రోహిత్ కాబోయే భార్య ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

Sirisha Lella.. శిరీష లెల్ల (Siresha lella).. తొలి మూవీ ప్రతినిధి -2 (Pratinidhi -2) సినిమాలో హీరోయిన్ గా నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే ఆ సినిమా హీరో నారా రోహిత్ (Nara Rohit) తో ఏడడుగులు వేయబోతోంది అంటూ వార్తలు వచ్చాయో ఒక్కసారిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది శిరీష లెల్ల. అనుకున్నట్టుగానే ఆదివారం రోజు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య హైదరాబాదులో వీరి నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా ఈ నిశ్చితార్థ వేడుకకు నారా, నందమూరి కుటుంబాలు హాజరయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి సతీసమేతంగా కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇక నారా రోహిత్ ఎవరో కాదు సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకే నారా రోహిత్.


శిరీష లెల్ల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..

ఇక ఇప్పుడు నారా రోహిత్ వివాహం చేసుకోబోతున్న హీరోయిన్ శిరీష లెల్ల ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అనే విషయాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి ఆమె స్వస్థలం ఎక్కడ..? ఆమె తల్లిదండ్రులు ఎవరు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. శిరీష లెల్ల ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించింది. వీరు గురజాల మండలం దైద ప్రాంతానికి చెందినవారు. అయితే అక్కడ కొన్ని కారణాలవల్ల ఆ ఊరిని వదిలి రెంటచింతలకి వలసొచ్చారు. ఈమె తండ్రి నాగేశ్వరరావు 30 ఏళ్ల క్రితమే రెంటచింతలకు వచ్చిన వీరు వ్యవసాయం చేస్తూ కష్టపడి జీవనం కొనసాగించేవారు. నాగేశ్వరరావుకి నలుగురు కుమార్తెలు.. నలుగురు కూడా ఉన్నత చదువులు చదివారు. పెద్దమ్మాయి శ్రీలక్ష్మి రెంటచింతలలో అంగన్వాడి సూపర్వైజర్ గా పని చేస్తూ ఉండగా.. రెండో అమ్మాయి భవాని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. ఇక మూడవ అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకొని ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటున్నారు.


సినిమా మీద ఆసక్తితో ఉద్యోగం వదిలి ఇండియాకి..

నాల్గవ అమ్మాయి శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివి అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. అయితే సినిమాలలో నటించాలనే కోరికతో జాబ్ వదిలేసి హైదరాబాద్ కి వచ్చి తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమాలలో నటించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారా రోహిత్ తో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం ప్రేమగా మారి ఆ కారణంగానే నారా రోహిత్ సినిమా ప్రతినిధి -2 లో అవకాశం దక్కించుకుంది. ఇక ఇప్పుడు వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం.

నారా రోహిత్ కెరియర్..

నారా రోహిత్ విషయానికి వస్తే.. సోలో సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన , ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా.. అనుకున్నంత గుర్తింపు లభించలేదు. ఇక ఇప్పుడు ప్రతినిధి -2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ ఓటీటీ లో కూడా సక్సెస్ అయ్యారు. ఇక ప్రస్తుతం సుందరకాండ అనే సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాతనే వివాహం చేసుకుంటారా? లేక ముందే వివాహం చేసుకుంటారా ..? అనే తెలియాల్సి ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×