Illu illaalu Pillalu TRP Rating : స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ నమోదు చేసుకుంటూ దూసుకుపోతుంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ ప్రసన్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రసారమైన సీరియల్స్ రేటింగ్ కూడా మంచిగా ఉండడంతో డిమాండ్ కూడా రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.. అందులో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టార్ మా లో దూసుకుపోతుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ ఈ మధ్య మరింత పెరిగింది అని చెప్పాలి. ఇక ఆలస్యం ఎందుకు నవంబర్ నెలలో హైలైట్ గా నిలిచిన ఎపిసోడ్లు ఏవి? అలాగే ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా నమోదయింది..? అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా చానల్లో సక్సెస్ఫుల్ రేటింగ్ తో దూసుకుపోతున్న టాప్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి.. ప్రతి నెల కూడా ఈ సీరియల్కు రేటింగ్ అనేది అమాంతం పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా సీరియల్ రేటింగ్ అనేది భారీగా పెరగడంతో ఎక్కువమంది సీరియల్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చందు అంజలిని చూడడం ఈ సీరియల్ అనుకోని ట్విస్ట్ అనే చెప్పాలి. అయితే అంజలి తన జీవితంలోకి మళ్లీ వస్తే బాగుంటుంది అని చెందు కోరుకుంటూ ఉంటారు. సాగర్ లంచం తీసుకుని దొరికిపోవడంతో నర్మదా తనని బయటికి తీసుకొచ్చి ప్రయత్నంలో భాగంగానే ఆ లంచం గురించి బయట పెట్టి సాగర్ ఉద్యోగం ఎలా చేస్తుంది.. దానితో సాగర్ చాలా కోపంగా ఉండిపోతాడు.. ధీరజ్ ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేయడం అలాగే అందరూ కలిసి వల్లిని మళ్లీ ఇంటికి తీసుకురావాలి అని అనుకోవడం ఇవన్నీ కూడా ఈ సీరియల్ లో హైలైట్ ఎపిసోడ్స్ గా నిలిచాయి.. ఇక శ్రీవల్లి కడుపుతో ఉన్న విషయం ఇంట్లో వాళ్లకి తెలియడం కూడా హైలెట్గా నిలిచింది మరి నర్మదా శ్రీవల్లిని మళ్లీ ఆ ఇంటికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. ఇవే ఈ నెల హైలెట్ ఎపిసోడ్స్..
ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ విషయానికి వస్తే.. చందు వల్లికి విడాకులు ఇవ్వాలని కోర్టు నోటీసు పంపిస్తాడు అయితే అది అడ్డుపెట్టుకొని భాగ్యం రామరాజు ఇంటి పరువు తీయాలని అనుకుంటుంది కానీ మళ్ళీ కడుపుతో ఉండడం వల్ల రామరాజు కుటుంబం మొత్తం వల్లికి సపోర్ట్ గా ఉంటారు.. చందు మాత్రం అంజలికి దగ్గరవుతూ ఉంటాడు. అటు ధీరజ్ భద్ర ప్లాన్ ని తిప్పికొట్టేందుకు దిమ్మ తిరిగిపోయేలా మాస్టర్ ప్లాన్ చేస్తాడు మొత్తానికి ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని వస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ లో వస్తున్న ప్రతి ఎపిసోడ్ కూడా జనాలని ఆకట్టుకోవడంతో అందరూ దీన్ని చూసేందుకు ఇంటర్ చూపిస్తున్నారు. వల్లి విషయంలో రామరాజు చందు గొడవ పడతారా? రామరాజు శ్రీవల్లిని ఇంటికి తీసుకొని వస్తాడా లేదా అన్నది ఇకముందు ఎపిసోడ్లలో చూడాలి..
Also Read :సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?