Scorpio Vehicle crashed: కార్తీకమాసం నేపథ్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు వేకువజామున హాజరవు తున్నాయి. అక్కడి నుంచి పైలోకానికి వెళ్లిపోయారు 13 మంది భక్తులు. తాజాగా రాంచీ-పాట్నా హైవేపై ఘోర ప్రమాదంలో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు.
జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోుట చేసుకుంది. రాంచీ-పాట్నా హైవేపై తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో స్కార్పియో వాహనం.. మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది స్పాటులో మరణించారు. కార్తీకమాసం నేపథ్యంలో బీహార్‌లోని నలంద జిల్లా జంగరోన్ గ్రామానికి చెందిన 14 మంది భక్తులు స్కార్పియో వాహనంలో బయలుదేరారు.
రామ్‌గఢ్ జిల్లాలోని రాజరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడానికి అంతా సర్దుకుని వాహనం ఎక్కారు. రామ్‌గఢ్‌లోని పాంకి సమీపంలో స్కార్పియో వాహనం, గుర్తు తెలియని మరొక వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటన తర్వాత వాహనం నుంచి భక్తుల ఆర్తనాదాలు వినిపించాయి. ప్రమాదం గురించి తెలియగానే హుటాహుటీన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, మరో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం సమయంలో స్కార్పియో వాహనంలో 14 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి వాహనం ఎంత వేగంగా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. మృతులంతా నలంద జిల్లా వాసులని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల నుంచి లభించిన ఆధార్ కార్డుల ద్వారా వారిని గుర్తించారు.
ప్రమాదం సమయంలో సాధారణ సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువమంది స్కార్పియో వాహనంలో పయనిస్తున్నారు. బాధితుల కుటుంబాలు నలంద జిల్లాకు చెందినవారు. దీంతో వారి గ్రామం విషాదంలో మునిగిపోయింది. మరణించిన 13 మందిలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. ప్రమాదం జరగడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించ లేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ: తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం!
झारखंड के रामगढ़ में दर्दनाक सड़क हादसा
रजरप्पा मंदिर जा रहे 13 श्रद्धालुओं की मौत, जिनमें 4 बच्चे और 4 महिलाएं शामिल हैं।#Jharkhand #Ramgarh pic.twitter.com/dk5w0VgkPC
— Abhishek raghav (@Abhishek4media) November 29, 2026