AP Politics : తిట్టుకుంటాం.. కొట్టుకుంటాం.. అయినా కలిసేఉంటాం. నారా లోకేశ్ తేల్చిచెప్పేశారు. అదే హింట్ అనుకున్నారో ఏమో.. కూటమి నేతలు తిట్టుకోవడం, కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. కూటమి సక్సెస్‌ఫుల్‌గా నడుస్తు్ండగా.. కుమ్ములాటలు కూడా తగ్గేదేలే అన్నట్టుగానే పెరుగుతున్నాయి. ఆ లిస్ట్‌లో పిఠాపురం ముందు వరుసలో నిలుస్తుండగా.. లేటేస్ట్‌గా విశాఖ జిల్లాలో కూటమి కుంపటి బ్లాస్ట్ అయింది.
ఇటీవలే వైజాగ్ మేయర్ పీఠం దక్కించుకుంది కూటమి. డిప్యూటీ మేయర్ సీటుకు సైతం ఎసరు పెట్టింది. టీడీపీ, బీజేపీ నాయకులు కలిసికట్టుగా ఆపరేషన్ వైజాగ్ టాస్క్ ఫినిష్ చేశారు. విదేశాల్లో క్యాంపులు గట్రా పెట్టి.. వైసీపీ నుంచి కార్పొరేటర్లను లాగేసి.. కూటమి సత్తా చాటారు. ఇక, ఆల్ హ్యాపీస్ అనుకుంటుండగానే….
గంటా వర్సెస్ రాజు
విశాఖలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ సీనియర్ లీడర్లే. మంత్రులుగా పని చేసిన వారే. ప్రోటోకాల్ విషయాల్లో మాటా మాటా పెరిగింది. మాటకు మాట అనుకున్నారు. కూటమిలో మంట రేపారు.
రాజు గారు గీత దాటుతున్నారా?
తనకు తెలీకుండానే తన నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు ఇన్వాల్వ్ అవుతున్నారంటూ ఎమ్మెల్యే గంటా అసహనం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని రాజు గారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
లీజుపై లిటిగేషన్
విశాఖ ఫిలింనగర్ క్లబ్ లీజు విషయంలో ఇటీవల జిల్లా కలెక్టర్‌ను కలిశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు. అయితే, ఫిలింనగర్ క్లబ్ భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని.. అది తన ఏరియా అని.. తనకు తెలీకుండా కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారనేది గంటా ఆగ్రహానికి కారణం. అయితే.. ముందుగా చెబుదామనే అనుకున్నానని.. కానీ ఆ టైమ్‌లో గంటా శ్రీనివాస్ అందుబాటులో లేరని విష్ణుకుమార్ రాజు కవర్ చేసే ప్రయత్నం చేశారు. అలా కాసేపు ఇద్దరు నేతల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Also Read : ఒకే జైల్లో, ఒకే బ్యారక్‌లో బద్ద శత్రువులు.. వల్లభనేని vs ఆంజనేయులు