Rashmi Gautam:రష్మీ గౌతమ్ (Rashmi Gautam).. ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. జబర్దస్త్ (Jabardast) కార్యక్రమం ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ షోకి రాక ముందు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత అమాంతం పెరిగిపోయింది. ఇంకా ‘జబర్దస్త్’ తో పాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోలకి కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ.. మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఏప్రిల్ 18న తనకు శస్త్ర చికిత్స జరిగిందని, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వల్లే భరించలేక సర్జరీ చేయించుకున్నాను అని తెలిపింది. కానీ అసలు దేనికి సర్జరీ..? ఎందుకు సర్జరీ..? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
గర్భాశయంలో గడ్డలు ఏర్పడ్డాయి.. అందుకే సర్జరీ..
ఇంకా ఇప్పుడు ఎట్టకేలకు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. “ఇటీవల తీవ్ర అనారోగ్య పాలయ్యాను కదా..ఎప్పుడు విపరీతమైన రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలతో బాధపడ్డాను. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ (గడ్డలు) ను ఆపరేషన్ చేసి మరీ తొలగించారు” అంటూ రష్మిక సోషల్ మీడియాలో తెలియజేసింది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బాధ అనుభవించావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే డాక్టర్లు సూచన మేరకు మూడు వారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు కూడా తెలిపింది రష్మిక. ప్రస్తుతం పనికి ఎలాగో బ్రేక్ ఇచ్చింది కాబట్టి ఈ మండుటెండల్లో కాస్త సేద తీరడానికి విహారయాత్రకు వెళ్లింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగా అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి బాలీ కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. నచ్చింది ఇష్టంగా ఆరగిస్తోంది.. అదే కాకుండా డాక్టర్ రాసిచ్చిన మందులను కూడా క్రమం తప్పకుండా వేసుకుంటూ ఆరోగ్యంగా తిరిగి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తోంది.
జీవితంలో ప్రతీదీ అనుభవించాల్సిందే..
ఇకపోతే తాజాగా బాలి దీవులకు వెళ్లిన ఈమె.. వెకేషన్ కి చెందిన ఫోటోలను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది.” రెండు నెలల క్రితమే ప్లాన్ చేశాను. కాకపోతే ఆటలు, పాటలు ఇలా ప్రతి విషయాన్ని కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని చూసాను. కానీ తీరా చూస్తే ఇప్పుడు తినడం, పడుకోవడం,పలు విషయాలు తెలుసుకోవడం తప్ప మరేమీ లేదు. విహారయాత్రలో ఇంతకుముందు ఎన్నడూ ఇలా జరగలేదు.దేవుడు జీవితంలో అన్నీ తెలుసుకోవడానికి ఇలా చేస్తాడేమో. ప్రస్తుతం నేను బాలిలోని ఒక విల్లాలో నా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో సేద తీరుతూ ఆరోగ్యాన్ని కూడా చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను” అంటూ రష్మీ తెలిపింది. రష్మి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఇప్పటినుంచే ఆరోగ్య సమస్యలు అంటే జీవితం ఎంతో కాలం ఉందని అటు అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే రష్మీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.