NPCIL Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులైన వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముంబయిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)లో వివధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 400
ప్రస్తుత ఖాళీలు: 396, బ్యాక్ లాగ్ ఖాళీలు: 4 పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విభాగాలు:
వివిద విభాగాల్లో ఈ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వివరాలు చూసినట్లయితే..
మెకానికల్: 150 పోస్టులు
కెమికల్: 60 పోస్టులు
ఎలక్ట్రికల్: 80 పోస్టులు
ఎలక్ట్రానిక్స్: 45 పోస్టులు
ఇన్ స్ట్రుమెంటేషన్: 20 పోస్టులు
సివిల్: 45 పోస్టులు
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 10
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 30
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పాసవ్వాలి.
వయస్సు: 2025 ఏప్రిల్ 30 నాటికి 26 ఏళ్ల మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500 ఫీజు ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.)
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: గేట్ 2023/ 2024/ 2025 స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
స్టైఫండ్: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ కల్పిస్తారు. నెల చొప్పున రూ.74,000 స్టైఫండ్ అందజేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://npcilcareers.co.in/MainSiten/default.aspx
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కల్పించనున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ కల్పిస్తారు. నెల చొప్పున రూ.74,000 స్టైఫండ్ అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: NMDC Recruitment: డిగ్రీ అర్హతతో 934 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,70,000 జీతం
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 400
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్, ఉద్యోగం ద్వారా