BigTV English

AP Politics : ఒకే జైల్లో, ఒకే బ్యారక్‌లో బద్ధ శత్రువులు.. రిటర్న్ గిఫ్ట్ అదుర్స్!

AP Politics : ఒకే జైల్లో, ఒకే బ్యారక్‌లో బద్ధ శత్రువులు.. రిటర్న్ గిఫ్ట్ అదుర్స్!

AP Politics : రాజకీయ నేతలు, పోలీసుల మధ్య అదో రకమైన బంధం ఉంటుంది. కుదిరితే.. పాలు, నీళ్లలా కలిసిపోతుంటారు. వీలైతే.. చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారు. లేదంటే.. ఉప్పు, నిప్పులా చిటపటలాడుతుంటారు. ఫ్రెండ్‌షిప్‌ ఏమో కానీ.. రివేంజే ఓ రేంజ్‌లో ఉంటుంటుంది. ఏబీవీ, సునీల్ కుమార్, పీఎస్‌ఆర్ లాంటి వాళ్లు ఆ కేటగిరీ పోలీస్ అధికారులే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సీన్ మారిపోతుంటుంది. ప్రమోషన్లు, పనిష్మెంట్లు ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంటాయి. అలాంటిదే లేటెస్ట్‌గా మరో ఆసక్తికర ఘటన జరిగింది.


వంశీ vs పీఎస్ఆర్

ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ, PSR ఆంజనేయులు హాట్‌టాపిక్‌గా మారారు. ఒకే జైల్లో, ఒకే బ్యారెక్‌లో వంశీని, PSRని ఉంచారు అధికారులు. ఒకప్పుటి బద్ధ శత్రువులు ఒకే బ్యారెక్‌లో ఉండటంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.


ఆ ఇద్దరి మధ్య గొడవేంటంటే..

2011లో విజయవాడ సీపీగా PSR ఆంజనేయులు ఉన్న సమయంలో వంశీతో గొడవ జరిగింది. వంశీ వెంట అనధికార కాన్వాయ్‌ తిరుగుతోందంటూ PSR కొన్ని వాహనాలను సీజ్‌ చేయించారు. అది జరిగిన కొన్నాళ్లకే ఓ మహిళా డాక్టర్‌కు అసభ్య సందేశాలు పంపారనే ఆరోపణలతో PSR ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. అదంతా వంశీనే చేయించారనేది ఆంజనేయులు ఆరోపణ. ఆ తర్వాత PSR నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వల్లభనేని వంశీ విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి మాజీ మావోయిస్టులకు ఆంజనేయులు సుపారీ ఇచ్చారని వంశీ ఆరోపించారు.

అప్పర్‌హ్యాండ్ ఎవరిది?

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటలిజెన్స్‌ చీఫ్‌ అయ్యారు PSR ఆంజనేయులు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలో చేరిపోయారు. ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న తన శత్రువు పాతపగతో ఏం చేస్తాడో అన్న భయంతోనే వంశీ వైసీపీలో చేరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కేవలం PSR నుంచి ముప్పు తప్పించుకోవడానికే వల్లభనేని వంశీ వైసీపీలో చేరారని జోరుగా చర్చ జరిగింది.

Also Read : ఉర్సా క్లస్టర్స్.. అసలేంటి వివాదం? కేశినేనిల గొడవేంటి?

డాక్టర్.. యాక్టర్.. ఒకే గూటి పక్షుల్లా..

ఇప్పుడు ఒకే జైల్లో, ఒకే బ్యారెక్‌లో వంశీ, PSR ఆంజనేయులు యాదృశ్చికంగా కలిశారు. అప్పట్లో డాక్టర్‌ వల్ల ట్రాన్స్‌ఫర్ అయిన PSR ఆంజనేయులు.. ఇప్పుడు యాక్టర్ జెత్వానీ కేసులో అరెస్టయ్యారు. మరోవైపు వంశీ కిడ్నాప్‌ కేసులో జైలుపాలయ్యారు. బద్ధ శత్రువులైన వంశీ, PSR ఒకే బ్యారెక్‌లో ఉండటంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కావాలనే వాళ్లిద్దరినీ అలా ఉంచారా? అనుకోకుండా అలా జరిగిపోయిందా? జైల్లో వాళ్లిద్దరూ కలిసిపోతారా? కాంప్రమైజ్ అవుతారా? లేదంటే, పాత పగలు తీర్చుకుంటారా?

Related News

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Big Stories

×