BigTV English

Atreyapuram Putharekulu : ఆత్రేయపురం పూతరేకులా మజాకా.. భౌగోళిక గుర్తింపుతో అరుదైన ఘనత..

Atreyapuram Putharekulu : ఆత్రేయపురం పూతరేకులా మజాకా.. భౌగోళిక గుర్తింపుతో అరుదైన ఘనత..


Atreyapuram Putharekulu(GI Tag products in andhra pradesh) : పూతరేకులు అనగానే గుర్తొచ్చేది పేరు ఆత్రేయపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం పూతరేకుల తయారికి పెట్టింది పేరు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆత్రేయపురం పూతరేకులకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. భౌగోళిక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజిస్ట్రీలో పూతరేకులు రికార్డయ్యాయి.

భౌగోళిక గుర్తింపు కోసం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పూతరేకుల సహకార సంఘం దరఖాస్తు చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర విభాగం ఫిబ్రవరి 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ జర్నల్‌లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 13 వరకు గడువు ఇచ్చారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో భౌగోళిక గుర్తింపు వచ్చిందని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పూతరేకుల సహకార సంఘం తెలిపింది.


ఏపీ నుంచి ఇప్పటి వరకు కేవలం 18 ఉత్పత్తులకే జీఐ ట్యాగ్ లభించింది. ఇందులో కొండపల్లి బొమ్మలు, తిరుపతి లడ్డూ, ఉప్పాడ జిందానీ చీరలు బందరు లడ్డూ లాంటివి ఉన్నాయి. తాజాగా ఆత్రేయపురం పూతరేకులకు ఈ లిస్ట్‌లో చోటు లభించింది. పూతరేకులు 400 సంవత్సరాల క్రితం నుంచి తయారు అవుతున్నాయని ఆధారాలు ఉన్నాయి.

ఇక్కడి పూర్వీకులు పూతరేకుల తయారీని వృత్తిగా చేసుకుని జీవనం సాగించినట్లు స్థానికులు చెబుతారు. పూతరేకుల తయారీలో మహిళలదే కీలక పాత్ర. బెల్లం, పంచదార, నేతితో తయారైన పూతరేకులతోపాటు డ్రై ఫ్రూట్స్, చాక్లెట్, షుగర్ ఫ్రీ, ఇంకా పలు రకాల ఫ్లేవర్లతో పూతరేకులను ఇక్కడ తయారు చేస్తున్నారు. వీటిని దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×