BigTV English

MSL 3 Syndrome: ఎమ్ఎస్ఎల్ 3 సిండ్రోమ్.. పిల్లల్లో అరుదైన వ్యాధి..

MSL 3 Syndrome: ఎమ్ఎస్ఎల్ 3 సిండ్రోమ్.. పిల్లల్లో అరుదైన వ్యాధి..
MSL 3 syndrome:

MSL 3 Syndrome : మనుషుల్లో ఒకొక్కరి జీన్స్ ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఈ జీన్స్‌ను స్టడీ చేయడం ద్వారా మనుషుల ఆరోగ్యంతో పాటు మరెన్నో విషయాలు కూడా తెలుస్తాయి. అయితే ఈ డీఎన్ఏ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోయినా, నిర్లక్ష్యం చేసిన పలు కొత్త సమస్యలకు దారితీస్తోంది. తాజాగా డీఎన్ఏ వల్ల పిల్లల్లో అరుదైన వ్యాధి సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ వ్యాధి పేరు ఎమ్ఎస్ఎల్ 3 సిండ్రోమ్ అని బయటపెట్టారు.


తాజాగా జీన్స్‌ను యాక్టివ్‌గా ఉండనివ్వకుండా ఉండే పలు డీఎన్ఏ ఎలిమెంట్స్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ ఎలిమెంట్స్ ద్వారా పిల్లల్లో ఎమ్ఎస్ఎల్ 3 సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి సంభవిస్తుందని తెలిపారు. ఇప్పటివకే ప్రపంచవ్యాప్తంగా పలు పిల్లల్లో ఈ వ్యాధిని గుర్తించారు. కానీ ఇది దేని వల్ల సోకుతుంది అనే విషయాన్ని తాజాగా కనుక్కున్నారు. ఇక ఈ డీఎన్ఏ ఎలిమెంట్స్‌పై మరిన్ని పరిశోధనలు చేస్తే.. ఈ వ్యాధి గురించి, దాని చికిత్సా విధానం గురించి మరింత తెలుసుకునే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.

ఎమ్ఎస్ఎల్ 3 జీన్స్‌లో మార్పుల కారణంగా ఎమ్ఎస్ఎల్ 3 సిండ్రోమ్ సోకుతుందని ప్రాథమిక పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు కేవలం 50 మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. కానీ చాలావరకు కేసులు గుర్తించలేక రిజిస్టర్ అవ్వడం లేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వ్యాధికి పూర్తిస్థాయిలో కారణం ఏంటని వారు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ ఎమ్ఎస్ఎల్ 3 జీన్స్ వల్ల వస్తుందని అనుకుంటున్నారు. ఈ వ్యాధి సోకిన వారు ఎప్పుడూ అటెన్షన్ కోసం ఎదురుచూస్తుంటారని వారు బయటపెట్టారు.


లైన్1 అనే డీఎన్ఏ ఎలిమెంట్స్.. జీన్స్‌లో మార్పులకు కారణమవుతాయని, మెల్లగా అవే ఈ వ్యాధికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎమ్ఎస్ఎల్ 3 సిండ్రోమ్ సోకినవారిలో బ్రెయిన్‌తో పలు అవయవాలు పెరిగే అవకాశం ఉండదని వారు గమనించారు. లైన్ 1 డీఎన్ఏ ఎలిమెంట్స్‌ను జంపింగ్ జీన్స్ అంటారని వారు తెలిపారు. ఇవి చాలావరకు ఏ హాని కలిగించకుండా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి సిండ్రోమ్స్‌కు దారితీస్తాయని అన్నారు. ప్రస్తుతం ఎమ్ఎస్ఎల్ 3 సిండ్రోమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని, దీనికి చికిత్సను కనిపెట్టడంలో బిజీగా ఉన్నారు శాస్త్రవేత్తలు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×