YS Jagan: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. రాయలసీమ లిఫ్ట్ కొత్త ప్రాజెక్టు కాదని, అదనపు నీటి కేటాయింపులు కోరడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే కేటాయించిన కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకునేందుకే ఈ పథకాన్ని చేపట్టామని ట్విట్టర్ వేదికగా వివరించారు.
రాయలసీమకు లిఫ్ట్ ఎందుకు అవసరం?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఒక ఇన్సూరెన్స్ స్కీంలా చూడాలని జగన్ పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయంలో 880 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పూర్తిస్థాయిలో నీటిని తరలించే అవకాశం ఉంటుందని వివరించారు. నీటిమట్టం 854 అడుగుల కంటే దిగువకు పడిపోతే నీటి తరలింపు సాధ్యం కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమకు కేటాయించిన నీటిని సద్వినియోగం చేసుకోవడానికి లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రాజెక్టులపై జగన్ ప్రస్తావన
తెలంగాణలోని ప్రాజెక్టులు శ్రీశైలంలో 800 అడుగుల నీటిమట్టం నుంచే నీటిని వినియోగించుకుంటున్నాయని జగన్ ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు రోజుకు దాదాపు 3 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యం ఉందని తన ట్వీట్‌లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిందని జగన్ విమర్శించారు. తనకు పేరు వస్తుందనే కారణంతోనే ప్రాజెక్టును ఆపేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌తో రాజకీయ స్నేహం కోసం చంద్రబాబు ఈ అంశంపై మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల రాయలసీమ ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలు దెబ్బతింటున్నాయన్నారు. రాయలసీమ లిఫ్ట్‌పై వాస్తవాలు తెలుసుకోకుండా అనవసర ఆరోపణలు చేయడం సరికాదని జగన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రాజెక్టుపై రాజకీయ చర్చ మరోసారి మొదలైంది.
రాయలసీమ లిఫ్ట్‌పై జగన్ సంచలన ట్వీట్
వాస్తవాలు పక్కదారి పడుతున్నాయన్న జగన్
చంద్రబాబు మౌనం ఎందుకన్న మాజీ సీఎం
లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదన్న జగన్
కొత్త నీటి కేటాయింపులు లేవని వెల్లడి
లిఫ్ట్ స్కీం ఇన్సూరెన్స్ లాంటిదన్న జగన్
చంద్రబాబు వచ్చాక పనులు ఆపేశారని, అనవసర… pic.twitter.com/2GMSf4wAZ7
— BIG TV Breaking News (@bigtvtelugu) November 26, 2026
Also Read: స్టూడెంట్స్ నుంచి సీనియర్ సిటిజన్ల వరకు.. అందరికీ ఉపయోగపడే ప్రభుత్వ స్కీమ్స్ ఇవే!