Tirumala Donation: తిరుమల శ్రీవారికి భక్తులు తమ మొక్కులను వింతవింతగా, భారీగా చెల్లించుకోవడం మనకు తెలిసిందే. అయితే, తాజాగా ఓ భక్తుడు ఏడుకొండలవాడికి ఇచ్చిన కానుక చూస్తే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అపురూప ఆభరణాలను టీటీడీకి అందజేశారు.
రూ.206 కోట్ల విలువైన స్వర్ణాభరణాలు
ఈ భారీ విరాళం గురించి మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. భక్తుడి భక్తిని ఎంతగానో కొనియాడారు. ఈ 121 కిలోల బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.206 కోట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇందులో 106 కిలోల బంగారంతో శ్రీవారి కోసం ప్రత్యేక ఆభరణాలను తయారు చేయించారు. మిగిలిన 15 కిలోల బంగారంతో పద్మావతి అమ్మవారి కోసం అత్యంత సుందరమైన స్వర్ణ వస్త్రాన్ని రూపొందించారు.
వజ్రాలు, రత్నాలతో అద్భుత డిజైన్
స్వామివారి కోసం చేయించిన ఆభరణాలను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా పాదకవచాలు, కౌస్తుభం, నాగాభరణాలను విలువైన వజ్రాలు, రత్నాలతో బ్రహ్మాండంగా డిజైన్ చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఇంతటి మహత్తర ఘట్టంలో తాను కూడా భాగస్వామి కావడం ఎంతో అదృష్టంగా, ఆనందంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
తిరుమలలోనే ఆ దివ్యానుభూతి: చంద్రబాబు
ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర మహత్యాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. శ్రీవారి వైభవాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. ప్రపంచంలో మరెక్కడా దొరకని గొప్ప దివ్యానుభూతి ఒక్క తిరుమలలోనే లభిస్తుందని అన్నారు. తరాలు మారుతున్నా ఏడుకొండలవాడిపై భక్తులకు ఉన్న అచంచలమైన విశ్వాసం ఏమాత్రం తగ్గలేదన్నారు. ఇంతటి భారీ విరాళం ఇవ్వడం తిరుమల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలు విరాళం
121 కిలోల బంగారు ఆభరణాలను ఈవోకు అందజేసిన చెన్నై భక్తుడు వర్దమాన్ జైన్
పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించే 46 రకాల ఆభరణాల సమర్పణ
విలువ సుమారు రూ.206 కోట్ల వరకు ఉంటుందని అంచనా#TTD #Tirumala #TirumalaTemple #TirumalaGold #Bigtv https://t.co/xkGJDkjlOw pic.twitter.com/C9mUAYRWUz
— BIG TV Breaking News (@bigtvtelugu) November 26, 2026
Also Read: ప్యాకేజ్డ్ ఫుడ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ గుర్తు ఉండాల్సిందే!