E-Paper
Advertisement

బైకర్‌ను ఢీకొట్టిన రెండు కార్లు.. గాల్లో పల్టీలు కొట్టి కిందపడ్డాడు.. కట్ చేస్తే ఊహించని సీన్!

బైకర్‌ను ఢీకొట్టిన రెండు కార్లు.. గాల్లో పల్టీలు కొట్టి కిందపడ్డాడు.. కట్ చేస్తే ఊహించని సీన్!
Advertisement

Bike Accident: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కొన్నిసార్లు చూసేవాళ్లకు కూడా గుండె ఆగినంత పనవుతుంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరం దగ్గర సరిగ్గా ఇలాంటి భయానక ఘటనే జరిగింది. ఆ ప్రమాదం తీవ్రత చూస్తే ఎవరైనా సరే, ఇక ఆ మనిషి బతకడం కష్టమే అనుకుంటారు. కానీ, ఆయుష్షు గట్టిదంటే ఇదేనేమో.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ యువకుడు ఏమీ కానట్లు లేచి, తన బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అసలేం జరిగిందంటే..

Advertisement

సామర్లకోటకు చెందిన సాలిక నవీన్, పెదరాయవరంలోని తన అత్తగారింట్లో ఉంటూ పెద్దాపురం దగ్గర్లోని ఓ రొయ్యల మేత తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం నాడు కాస్త ఒంట్లో బాగోలేదని ఆఫీసులో సెలవు పెట్టి, తన బైక్ మీద ఇంటికి బయలుదేరాడు. పెదరాయవరం దగ్గర ఏడీబీ రోడ్డుపై వెళ్తూ అకస్మాత్తుగా మలుపు తిరిగాడు. సరిగ్గా అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు ఒకదాని తర్వాత ఒకటి నవీన్ బైకును బలంగా ఢీకొట్టాయి.

సినిమా స్టంట్‌ను తలపించిన దృశ్యం

Advertisement

ఆ కార్లు గుద్దిన వేగానికి నవీన్ గాల్లో పల్టీలు కొడుతూ దాదాపు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు. పక్కనే ఉన్న పెట్రోల్ బంకు సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. యాక్సిడెంట్ చూసిన స్థానికులు భయంతో వణికిపోతూ.. తీవ్రంగా గాయపడి ఉంటాడని కంగారుగా ఆయన చుట్టూ చేరారు.

అందరికీ షాక్ ఇచ్చిన ట్విస్ట్

కానీ, అందరూ చూస్తుండగానే నవీన్ చిన్నపాటి గాయాలతోనే క్షేమంగా పైకి లేచాడు. ఏమీ జరగనట్లు తన బైకును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా నవీన్ నిజంగా ‘మృత్యుంజయుడు’ అంటూ అభినందిస్తున్నారు.

Also Read: శ్రీవారికి 121 కిలోల స్వర్ణ కానుక.. ఆ బంగారంతో ఏమేం చేయించారో తెలుసా?

Tags

Related News

శ్రీవారికి 121 కిలోల స్వర్ణ కానుక.. ఆ బంగారంతో ఏమేం చేయించారో తెలుసా?

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికలు రద్దు.. బ్యాలెట్ బాక్స్‌‌లో ఇంకు పోసిన వ్యక్తులు

‘నాకు పేరు వస్తుందనే రాయలసీమ లిఫ్ట్ ఆపేశారా?’.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం.. ఆ మహాదాత ఎవరో తెలిసిపోయింది!

చరిత్ర తిరగరాసిన వైసీపీ.. జగన్‌కు దెబ్బ మీద దెబ్బ, మళ్లీ ఏం జరిగింది?

ఊరికి మొనగాడు ఎవరు? ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, మధ్యాహ్నం తర్వాత ఫలితాలు

తుపాన్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. స్పాట్‌లో నలుగురు మృతి, అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×