BigTV English

AP Assembly : పేదల సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధిలో టాప్ : గవర్నర్

AP Assembly : పేదల సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధిలో టాప్ : గవర్నర్

AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారి గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నట్లు వివరించారు. విద్యాప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వైద్యరంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలును వివరించారు.


గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు…
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా..
రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం
ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు
జడ్పీ ఛైర్మన్‌ పదవుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం
137 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవుల్లో 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం
15.14 లక్షల ఎస్సీ కుటుంబాలకు, 4.5 ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

అగ్రస్థానంలో ఏపీ..
ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజ
11.43 శాతం గ్రోత్‌ రేటు
గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా భారీగా పెట్టుబడులు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీ ముందంజ
వ్యర్థరహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యం
గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమస్థానంలో ఏపీ
పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఏపీ
మాంసం ఉత్పత్తిలో ఏపీకి రెండో స్థానం


మెరుగైన వైద్యసేవలు
వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్‌ కార్డులు
పీహెచ్‌సీలలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు

అందరికీ ఇళ్లు
వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు
మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు

పేదల సంక్షేమం
ప్రతి నెల 1న వైఎస్సార్‌ పింఛన్‌ కానుక
వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ
నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థికసాయం
81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ
వైఎస్సార్‌ బీమా కింద రెండేళ్లలో రూ.512 కోట్లు జమ

విద్యా వెలుగులు..
మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు
విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్‌ లెర్నింగ్‌
విద్యార్థులకు రూ.690 కోట్లు ఖర్చు చేసి 5.20 లక్షల ట్యాబ్‌ల పంపిణీ
అమ్మఒడి ద్వారా 80 లక్షల మంది విద్యార్థులకు ఆర్థికసాయం
44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్లు ఆర్థికసాయం
విద్యార్థులకు జగనన్న విద్యా​కానుక పంపిణీ
2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు
1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు రీడిజైన్‌
జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి
జగనన్న గోరుముద్ద ద్వారా ఇప్పటివరకు రూ.3,239 కోట్లు ఖర్చు
రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు
కూరుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు
కడపలో డా.వైఎస్సార్‌ ఆర్కిటైక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్ వర్శిటీ

ఇలా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది.

JanaSena: పవన్ ప్రసంగంపై ఫుల్ అటెన్షన్.. జగన్‌కు ఝలక్ తప్పదా?

TSPSC: గ్రూప్-1 పేపర్ కూడా లీక్?.. ప్రవీణ్ ఫోన్‌లో అమ్మాయిల నగ్న ఫొటోలు..

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×