E-Paper
Advertisement

Bears: వాల్మీకి మహర్షి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఎలుగుబంట్లు

Bears: వాల్మీకి మహర్షి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఎలుగుబంట్లు
Advertisement

Bears: శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం సాధారణంగా భయాందోళనలకు కారణమవుతుంది. కానీ.. గుడిబండలో చోటు చేసుకున్న ఒ సంఘటన మాత్రం భయాన్ని కాదు.. ఆశ్యర్యం , ఆసక్తిని కలిగించింది. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వాల్మీకి మహార్షి విగ్రహం వద్దకు రెండు ఎలుగుబంట్లు రావడం.. అవి ప్రవర్తించిన తీరు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అర్థరాత్రి నిశ్శబ్ద సమయంలో అటవీ ప్రాంతం నుంచి వచ్చిన రెండు ఎలుగుబంట్లు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహం వద్దకు చేరుకున్నాయి. అక్కడ కొద్దిసేపు నిలిచిన తర్వాత చుట్టూ ప్రశాంతంగా ప్రదక్షిణ చేసినట్టు ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు.సాధారణంగా ఎక్కడైనా ఎలుగుబంట్లు జనాలను చూసి దాడికి దిగుతాయనే భయం ఉన్నా.. ఇక్కడ మాత్రం అవి ఎలాంటి ఆగ్రహం లేకుంగా చాలా శాంతంగా కదలాడటం అందరినీ విస్మయానికి గురిచేసింది.

Advertisement

అనంతరం ప్రదక్షిణలు పూర్తి చేసుకుని అక్కడ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. అటుగా నడుచుకుంటూ వస్తున్న కొందరు గ్రామస్తులు ఎలుగుబంట్లు గమనించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అవి ఒక్కసారిగా వెనక్కి తిరిగి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసాయి. అయితే గ్రామాల్లోకి వచ్చినప్పటికీ ఎటువంటి ఆస్తి నష్టం.. ప్రాణం నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పైగా అర్ధరాత్రి సమయంలో ఇలాంటి అరుదైన దృశ్యం గ్రామస్తులు చూడడంతో దీనిని దైవిక సంకేతంగా భావిస్తున్నారు.

ఈ సంఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందిస్తూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళల్లో ఒంటరిగా బయట తిరగకూడదని సూచించారు. అదే సమయంలో ఎలుగుబంట్లు ఎలాంటి హాని చేయకుండా తిరిగి అటవీ ప్రాంతానికి వెళ్లిపోవడం గుడిబండలో ఒక గుర్తుండిపోయే ఘటనగా నిలిచిపోయింది.

Advertisement

ALSO READ: Chittoor Crime: వీడు అసలు తండ్రేనా.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. కన్న కూతురిపై..

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×