E-Paper
Advertisement

సిక్కోలు మేయర్ పీఠంపై కన్నేసిన వైసీపీ కన్ను.. మేయర్ అభ్యర్థి లక్ష్మిదేవి, టీడీపీ అసమ్మతిలపై ధర్మాన వల

సిక్కోలు మేయర్ పీఠంపై కన్నేసిన వైసీపీ కన్ను..  మేయర్ అభ్యర్థి లక్ష్మిదేవి, టీడీపీ అసమ్మతిలపై ధర్మాన వల
Advertisement

Srikakulam City: సిక్కోలు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కార్పొరేషన్ పీఠం దక్కించుకోవాలని ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది వైసీపీ. టీడీపీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మిదేవిని వైసీపీలోకి రప్పించిన ధర్మాన ప్రసాదరావు, ఆమెని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టారు. గెలుపుకోసం తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

శ్రీకాకుళం సిటీలో గుండ లక్ష్మిదేవి కాస్త మంచి పేరు ఉంది. ఆమెని తమ వైపు తిప్పుకుని సక్సెస్ సాధించారు వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు. ఆమెని మేయర్ అభ్యర్థిగా నిలిబెట్టించారు. ఆమె గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నార్మల్‌గా అక్కడ టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటే ఓడించడం చాలా కష్టం. కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లింది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకుని పావులు కదిపారు ధర్మాన ప్రసాదరావు.

Advertisement

బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు శ్రీకాకుళం కార్పొరేషన్ వైసీపీ మేయర్ అభ్యర్ధి గుండ లక్ష్మిదేవి. తనకు ప్రజలు మద్దతు ఉందని, ఆ అభిమానంతో నన్ను గెలిపిస్తారని ధీమాగా చెబుతున్నారు. టీడీపీ నుండి వైసీపీకి మారి మంచి పని చేశానని ప్రజలు అంటున్నారని వివరించారు. పదవులను ఆశించి ఎప్పుడు పని చేయలేదని, నా జీవితంలో ఎన్నో ఏళ్లు ప్రజా ప్రదినిధిగా పని చేశాను అన్నారు. అభివృద్ధి చేయడానికి శ్రీకాకుళం మున్సిపాలిటిని.. కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ చేశామన్నారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా నా భర్త అప్పల సూర్య నారాయణ పని చేశారని, సిటీలో ఆయన విగ్రహం పెట్టడానికి టీడీపీ నేతలు రాద్దాంతం చేశారని దుయ్యబట్టారు. విగ్రహం కట్టడానికి నిర్మించిన దిమ్మెలను కూల గొట్టించారని ఆరోపించారు. ఎన్నికల ముందు హఠాత్తుగా విగ్రహం పెట్టించారని మండిపడ్డారు. అంతా ప్రేమ ఉంటే సెవన్ రోడ్ జంక్షన్‌లో విగ్రహం పెట్టాలని, అక్కడ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నా మీద నిందలు వేసి ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ నేతలు ఇలాంటి పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

ALSO READ: ఏపీలో మినీ మున్సిపాలిటీ ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థులు జాబితా, కాకపోతే కొన్ని చోట్ల అభ్యర్థులపై

Related News

ఏపీలో మినీ మున్సిపాలిటీ ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థులు జాబితా, కాకపోతే కొన్ని చోట్ల అభ్యర్థులపై

తొలిరోజే భగ్గుమన్న పల్లె పోరు.. పలు జిల్లాల్లో ఉద్రిక్తత, పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన బీజేపీ నేత!

ఏపీలో అరుదైన ఘటన.. పుట్టుకతో తల నిండా జుట్టుతో జన్మించిన చిన్నారి!

శ్రీశైలం భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటలూ నాన్‌స్టాప్ ప్రయాణం!

కర్నూలులో అద్భుత ఆచారం.. ఇక్కడ పాలు అమ్మబడవు.. కానీ అందరికి ఉచితం?

ఏపీని వణికించేందుకు వస్తున్న ఆక్వాన్ తుఫాన్.. నవంబర్ 17 నుంచే భారీ వర్షాలు!

మేయర్, ఛైర్మన్ స్థానాలకు.. జనసేన అభ్యర్థుల ఖరారు!

Big Stories

Advertisement
×