E-Paper
Advertisement

శ్రీశైలం భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటలూ నాన్‌స్టాప్ ప్రయాణం!

శ్రీశైలం భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటలూ నాన్‌స్టాప్ ప్రయాణం!
Advertisement

Srisailam: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ సూపర్ గుడ్ న్యూస్ అందిస్తోంది. నేషనల్ హైవే 765 పరిధిలో.. నంద్యాల జిల్లా సుండిపెంట డ్యామ్ నుంచి దోర్నాల వరకు సుమారు 43 కిలోమీటర్ల మేర ‘ఎలివేటెడ్ కారిడార్’ నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. అంటే అడవి మధ్యలో నేల మీద కాకుండా, భారీ పిల్లర్ల మీద ఫ్లైఓవర్ తరహాలో 30 మీటర్ల వెడల్పుతో ఈ హైవేను నిర్మించబోతున్నారు. అది కూడా పెద్దగా మలుపులు లేకుండా స్ట్రెయిట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డుకు సరికొత్త రూపం!

Advertisement

ప్రస్తుతం నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో, అడవి జంతువుల రక్షణ కోసం రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డును పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. మహాశివరాత్రి, ఉగాది లాంటి పెద్ద పండుగలు తప్పితే, మిగతా రోజుల్లో రాత్రిపూట ప్రయాణానికి ఛాన్సే లేదు. మరోవైపు శ్రీశైలం వచ్చే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. రాత్రిపూట గేట్లు మూసేయడం వల్ల వేలాది మంది భక్తులు అడవి బయటే జాగారం చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేంద్రం ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. పిల్లర్ల మీద హైవే కట్టడం వల్ల కింద అడవిలో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి. వాటికి వాహనాల శబ్దం కానీ, యాక్సిడెంట్ల భయం కానీ ఉండదు. అదే సమయంలో పైన హైవే మీద భక్తులు 24 గంటలూ, ఎలాంటి టైమ్ లిమిట్ లేకుండా, చాలా తక్కువ సమయంలో సేఫ్‌గా శ్రీశైలం చేరుకోవచ్చు.

మరో 20 రోజుల్లో మొత్తం సర్వే రిపోర్ట్ రెడీ

Advertisement

కేవలం కాగితాల మీదే కాకుండా, గ్రౌండ్ లెవల్‌లో పనులు కూడా మొదలయ్యాయి. అటవీశాఖ పర్యవేక్షణలో శ్రీజ్యోతి ఇంజనీరింగ్ సంస్థ ద్వారా నేషనల్ హైవే అథారిటీ టీమ్ ప్రత్యేక సర్వే చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఈ సర్వే పనులు స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, నెక్కంటి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సర్వే కంప్లీట్ అయింది. ప్రస్తుతం దోర్నాల రేంజ్ పరిధిలో సర్వే చేస్తున్నారు. మరో 20 రోజుల్లో మొత్తం సర్వే రిపోర్ట్ రెడీ అవుతుందని సర్వే అధికారులు చెబుతున్నారు.

Also Read: అమాయకుల సొమ్ముతో రియల్టర్ల దందా.. నారాయణఖేడ్‌లో అసలేం జరుగుతోంది?

Tags

Related News

ఏపీలో అరుదైన ఘటన.. పుట్టుకతో తల నిండా జుట్టుతో జన్మించిన చిన్నారి!

కర్నూలులో అద్భుత ఆచారం.. ఇక్కడ పాలు అమ్మబడవు.. కానీ అందరికి ఉచితం?

ఏపీని వణికించేందుకు వస్తున్న ఆక్వాన్ తుఫాన్.. నవంబర్ 17 నుంచే భారీ వర్షాలు!

మేయర్, ఛైర్మన్ స్థానాలకు.. జనసేన అభ్యర్థుల ఖరారు!

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ఐదేళ్ల స్నేహితుడిని నరికి చంపిన నిందితుడు!

సీబీఐ అధికారుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. ఐదుగురి అరెస్టు

సీఎం చంద్రబాబుతో జనసేన నేతలు భేటీ.. ZP ఛైర్మన్ పదవులపై అదే ఉత్కంఠ, సాయంత్రం నాటికి

Big Stories

Advertisement
×